ఈ సమస్యలకి తమలపాకుల దివ్యఔషదం..

TV9 Telugu

18 July 2024

యూరిక్ యాసిడ్ స్థాయిల్ని తగ్గించడంలో తమలపాకులు ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిలోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పిని తగ్గిస్తాయి.

బోలు ఎముకల వ్యాధి రాకుండా ఉండాలంటే తమలపాకును నమిలి తినాల్సి ఉంటుంది. అందులో సున్నం, వక్క వంటివి ఏవీ కలిపి తినరాదు.

ప్రతి రోజూ తమలపాకు తినడం వల్ల వాటిలో ఉన్న యాంటీ బాక్టీరియల్ గుణాలు నోటిలోని అనేక బ్యాక్టీరియాలతో పోరాడుతాయి.

భోజనం తర్వాత తమలపాకును తింటే.. కడుపుకి మేలు. నోటి దుర్వాసన, పంటినొప్పి, చిగుళ్లనొప్పులు, వాపులు, నోటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

ప్రేగులను రక్షించడం, అపానవాయువును నివారించడంలోనూ తమలపాకులు సహాయపడుతాయి. జీవక్రియను పెంచుతాయి.

తమలపాకు శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది ప్రేగులు విటమిన్లు, పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.

తమలపాకులు రుమటాయిడ్ ఆర్థరైటిస్, హైపర్‌ యూరిసెమియాను నియంత్రించడమే కాకుండా.. టైప్ 2 డయాబెటీస్ ను నియంత్రిస్తాయి.

రుతు క్రమం సరిగ్గా రాని స్త్రీలు కూడా ప్రతిరోజూ తమలపాకును తింటే.. ఆ సమస్య తగ్గి.. రుతుక్రమం సక్రమంగా వస్తుంది.