పాదచారుల ప్రాణాలకూ ముప్పు?

|

Nov 18, 2019 | 6:22 PM

నడక ఆరోగ్యానికి, ఆయువుకు చాలా మంచిదంటారు. కానీ, అదే నడక అకాల మరణాలకు, అనుకోని రోడ్డుప్రమాదాలకు కూడా కారణమవుతోంది. సాధారణంగా రోడ్డు ప్రయాణాల్లో కార్లు, బైక్లు ఉన్నవారికే రిస్క్ అని అనుకుంటుంటాం..కానీ, వారికంటె ఎక్కువగా పాదచారులకే  ప్రమాదం పొంచివుందని తాజా నివేదికలను చూస్తే అర్ధమవుతోంది. మన దేశంలోని నగరాల్లో పాదచారుల మరణాల సంఖ్య నాలుగేళ్లలో ఏకంగా 84శాతానికి పెరిగింది. 2014 సంవత్సరంలో రోజుకు 32 మంది పాదచారులు రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతే, 2014కి వచ్చేసరికి ఆ […]

పాదచారుల ప్రాణాలకూ  ముప్పు?
Follow us on

నడక ఆరోగ్యానికి, ఆయువుకు చాలా మంచిదంటారు. కానీ, అదే నడక అకాల మరణాలకు, అనుకోని రోడ్డుప్రమాదాలకు కూడా కారణమవుతోంది. సాధారణంగా రోడ్డు ప్రయాణాల్లో కార్లు, బైక్లు ఉన్నవారికే రిస్క్ అని అనుకుంటుంటాం..కానీ, వారికంటె ఎక్కువగా పాదచారులకే  ప్రమాదం పొంచివుందని తాజా నివేదికలను చూస్తే అర్ధమవుతోంది.

మన దేశంలోని నగరాల్లో పాదచారుల మరణాల సంఖ్య నాలుగేళ్లలో ఏకంగా 84శాతానికి పెరిగింది. 2014 సంవత్సరంలో రోజుకు 32 మంది పాదచారులు రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతే, 2014కి వచ్చేసరికి ఆ సంఖ్య 62కి చేరినట్టు నివేదికలు తెలుపుతున్నాయి. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రోడ్డు ప్రమాద నివేదిక ప్రకారం, 2014 లో దేశవ్యాప్తంగా 12,330 మంది పాదచారులు మరణించారు. 2015 లో 13,894, 2016 లో 15,746, 2017 లో 20,457గా ఉన్న ఈ సంఖ్య గత సంవత్సరానికి 22,656 కు పెరిగింది.

రోడ్డుమార్గాల గురించి ప్రణాళికలు చేసేప్పుడు లేదా ట్రాఫిక్ రూల్స్ తయారుచేసేటప్పుడు రహదారిపై పాదచారుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని, అందుకే నానాటికీ ఈ ప్రమాదాలు పెరిగిపోతున్నాయని రహదారి భద్రతా నిపుణులు తెలిపారు. పాదచారుల ప్రాణాలకు చట్టవిరుద్ధంగా ఆక్రమించిన రోడ్డు ఫుట్‌పాత్‌లు కూడా కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.