కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన సిద్దూ

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. మరోసారి వార్తలకెక్కారు. ఆయన దుందుడుకు వ్యవహార శైలితో సొంత పార్టీ కార్యకర్త గూబ గుయ్‌మనిపించారు. వివరాల్లోకి వెళితే సిద్ధరామయ్య ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా ఆ పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఫోన్‌లో మాట్లాడుతూ సిద్దూ చెవిదగ్గర ఫోన్ పెట్టబోయాడు. దీంతో విసిగిపోయిన ఆయన ఆ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. ఈ వీడియో ఇప్పుుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అరెస్టు తర్వాత కార్యకర్తలకు […]

కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన సిద్దూ
Follow us

| Edited By:

Updated on: Sep 05, 2019 | 11:10 AM

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. మరోసారి వార్తలకెక్కారు. ఆయన దుందుడుకు వ్యవహార శైలితో సొంత పార్టీ కార్యకర్త గూబ గుయ్‌మనిపించారు. వివరాల్లోకి వెళితే సిద్ధరామయ్య ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా ఆ పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఫోన్‌లో మాట్లాడుతూ సిద్దూ చెవిదగ్గర ఫోన్ పెట్టబోయాడు. దీంతో విసిగిపోయిన ఆయన ఆ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. ఈ వీడియో ఇప్పుుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అరెస్టు తర్వాత కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికే ఆయన పర్యటిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో కూడా సిద్ధరామయ్య ఓ సమావేశంలో ఓ మహిళా అధికారిని కూడా చున్నీ పట్టుకుని లాగారు. అప్పుడు కూడా ఆ వీడియో వైరల్‌ అయ్యింది. సిద్ధరామయ్య ఇటువంటి పనులతో ఆయన మీడియాకు చిక్కుతున్నారు. అయితే తనపై మీడియా కావాలనే బురదజల్లుతుందని ఆయన ఆరోపిస్తున్నారు.