ముంచుకొస్తున్న ‘ఎల్‌నినో’ ముప్పు.. తలకిందులు కానున్న రుతుపవన వ్యవస్థ! సైంటిస్టుల సీరియస్ వార్నింగ్

ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన ఎల్‌నినో ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు అనూహ్య రీతిలో మారిపోతాయని, ఉష్ణోగ్రతలు భారీగా పెరగొచ్చని, రుతుపవనాలు అసాధారణంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా రుతుపవనాలపై ఏ విధంగా ఉంటుందనే దానిపై నిశితంగా పరిశీలిస్తున్నారు..

ముంచుకొస్తున్న ఎల్‌నినో ముప్పు.. తలకిందులు కానున్న రుతుపవన వ్యవస్థ! సైంటిస్టుల సీరియస్ వార్నింగ్
El Nino could reshape monsoon season

Updated on: May 26, 2026 | 9:12 AM

పసిఫిక్ మహాసముద్రంలో అభివృద్ధి చెందుతున్న ఎల్‌నినో వాతావరణ వ్యవస్థ సాధారణ వర్షపాత విధానాన్ని తీవ్రంగా దెబ్బతీయనుంది. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో కరువును, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాలను తెచ్చే అవకాశం ఉందని నేషనల్ జియోగ్రాఫిక్ నివేదించింది. అందుకే దీన్ని ‘సూపర్‌ ఎల్‌నినో’గా సైంటిస్టులు చెబుతున్నారు.

ఎల్‌నినో అంటే ఏమిటి?

పసిఫిక్‌ మహా సముద్రంలోని నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని ‘ఎల్‌నినో’ అంటారు. ఇది 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి కనిపించే ఊహించని వాతావరణ దృగ్విషయం. ఇది జరిగినప్పుడు వాతావరణంలో తేమ కదలికలను మార్చి, కొన్ని చోట్ల పొడి పరిస్థితులను, మరికొన్ని చోట్ల భారీ వర్షాలను కలిగిస్తుంది. గతంలో ఎల్‌నినో బలహీనమైన రుతుపవనాలు, కరువు, పంట నష్టాలు వంటి పరిస్థితులను కలిగించింది. గతంలో 1982-83, 1997-98, 2015-16లో ఇటువంటి భారీ మార్పులు సంభవించాయి. ఈ ఏడాది కొన్ని చోట్ల వర్షపాతం తగ్గడం, మరికొన్ని చోట్ల అధిక వర్షపాత ఘటనలు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శీతాకాలం, వసంతకాలంలో జరిగే పరిణామాలు రుతుపవనాల సీజన్‌పై గరిష్ట ప్రభావాలు చూపుతాయని అమెరికా NOAA వాతావరణ అంచనా కేంద్రం ఆపరేషనల్ ప్రిడిక్షన్ బ్రాంచ్ చీఫ్ జాన్ గోట్‌షాల్క్ తెలిపారు. ఈ ఏడాది జూన్‌-ఆగస్టు 2026 మధ్యలో ఎల్‌నినో మొదలై ఏడాది చివరి వరకు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

పసిఫిక్‌ నీరు అసాధరణంగా వేడెక్కడం వల్ల సాధారణంగా కాలానుగుణ వర్షాలు పడే ప్రాంతాల్లో ఆహార భద్రత, కరువు, కారుచిచ్చు వంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. మరోవైపు ఎల్ నినో పరిస్థితులు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల బలమైన రుతుపవనాల కారణంగా అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారత్‌లో సాధారణంగా ఎల్‌నినో సంవత్సరాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. ఈ క్రమంలో పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను జాగ్రత్తగా పరిశీలిస్తోంది. హిమాలయాల్లో తక్కువ మంచు కవరేజ్, అమెరికా నైరుతి ప్రాంతంలో పొడి శీతాకాలం వంటి కారకాలు ఎల్‌నినో ఉన్నప్పటికీ రుతుపవనాలను బలపరిచే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఈసారి పసిఫిక్‌ వేడెక్కడం బేసిన్-వైడ్‌గా కనిపిస్తుంది. భారత్‌, ఇండోనేషియా, పశ్చిమ ఆఫ్రికా రుతుపవన వ్యవస్థను ప్రభావం చూపే అవకాశం ఉందని గాట్‌షాల్క్‌ పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిపోవడంవల్ల భారత్‌లో కరవు సంభవించే అవకాశాలున్నాయి. అలాగే మధ్య ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌తోపాటు దక్షిణ పసిఫిక్, మధ్య అమెరికా, ఉత్తర బ్రెజిల్‌ వంటి ప్రాంతాల్లోనూ కరవు సంభవించే అవకాశాలున్నాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us