కరోనా ఎఫెక్ట్.. జూలై 31 వరకు పాఠశాలలకు సెలవుల పొడిగింపు

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 31 వరకు పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు.

  • Tv9 Telugu
  • Publish Date - 7:42 pm, Fri, 26 June 20
కరోనా ఎఫెక్ట్.. జూలై 31 వరకు పాఠశాలలకు సెలవుల పొడిగింపు

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 31 వరకు పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. సాధారణ షెడ్యూల్ ప్రకారం జూలై 1వ తేది నుంచి ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతూ ఉండటం.. విద్యార్ధుల తల్లితండ్రుల అభ్యర్ధన, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే కరోనా నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మాత్రమే కాదు చాలా రాష్ట్రాలు పాఠశాలలకు సెలవులను పొడిగించాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా పలు పరీక్షలు రద్దైన విషయం తెలిసిందే.