ఎస్సీ, ఎస్టీ సవరణ చట్టం-2018 రాజ్యాంగ బధ్ధతనుసుప్రీంకోర్టు సమర్థించింది. ప్రాథమిక విచారణలో ఆరోపణ నిరూపణ కాకపోతేనే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సూచించింది. అయితే మినహాయింపునిచ్ఛే కొన్ని కేసుల్లో ఎఫ్ ఐ ఆర్ లను కొట్టివేయవచ్ఛు అని కూడా కోర్టు పేర్కొంది. ఎఫ్ ఐ ఆర్ నమోదుకు ముందు ప్రాథమిక విచారణ అవసరం లేదని జస్టిస్అరుణ్ మిశ్రా ఆధ్వర్యంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఈ బెంచ్ లోని మరో న్యాయమూర్తి రవీంద్ర భట్.. వేరుగా తీర్పునిస్తూ.. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే.. అంటే బెయిలును తిరస్కరించిన సందర్భాల్లోనే ప్రీ-అరెస్ట్ బెయిలును మంజూరు చేయవచ్చునంటూ ఓ కేవియట్ ని జోడించారు. సవరించిన ఈ చట్టం దుర్వినియోగమవుతోందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం నిబంధనలను సడలిస్తూ.. 2018 మార్చి 20 న తీర్పునిచ్చింది. దీంతో ఈ చట్టాన్ని నీరుగార్చుతున్నారంటూ దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. కోర్టు తీర్పును సమీక్షించాలని కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీన్ని విచారించిన కోర్టు.. మార్చి 20 నాటి మార్గదర్శకాలను, సూచనలను నిల్పుదల చేస్తూ గత ఏడాది అక్టోబరు ఒకటో తేదీన తీర్పు ఇచ్చింది.