Telugu News India News Sankranti Special Trains 2024: South Central Railway (SCR) announces 20 special trains for easy travel
Sankranti Special Trains 2024: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్! ఏయే రూట్లలో ఉన్నాయంటే..
సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లు కాచీగూడ నుంచి కాకినాడ, హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య తిరగనున్నాయి. అలాగే విజయవాడ మీదుగా కూడా వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం (డిసెంబర్ 21) ఒక ప్రకటనలో తెలిపారు..
హైదరాబాద్, డిసెంబర్ 22: సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లు కాచీగూడ నుంచి కాకినాడ, హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య తిరగనున్నాయి. అలాగే విజయవాడ మీదుగా కూడా వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం (డిసెంబర్ 21) ఒక ప్రకటనలో తెలిపారు.
కాచిగూడ- కాకినాడ మధ్యలో తిరిగే రైళ్లు ఇవే..
కాచిగూడ-కాకినాడ టౌన్ (07653) డిసెంబర్ 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది
కాకినాడ టౌన్ – కాచిగూడ (07654) డిసెంబర్ 29, జనవరి 5,12,19, 26 తేదీల్లో నడుస్తుంది
హైదరాబాద్-తిరుపతి (07509) డిసెంబర్ 28, జనవరి 4,11,18, 25 తేదీల్లో నడుస్తుంది
తిరుపతి – హైదరాబాద్ (07510) డిసెంబర్ 29, జనవరి 5,12,19, 26 తేదీల్లో నడుస్తుంది
ఈ ప్రత్యేక రైళ్లన్నిటిలో AC 1, 2, 3 టైర్లతోపాటు స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంంటాయి.