సోషల్ మీడియాకు ఇక ‘ కళ్లెం ‘ .. ‘ నా ఇష్టం అంటే కుదరదు ‘..

  సోషల్ మీడియాకు ఇక ‘ బ్రేకులు ‘ పడనున్నాయి. ‘ నా ఇష్టం ‘ అంటూ ఈ మీడియాలో చెలరేగేవారికి ఇదో చేదు వార్త. సామాజిక మాధ్యమాలను నియంత్రించాల్సి ఉందని భావిస్తున్న కేంద్రం మరో మూడు నెలల్లో విధివిధానాలను రూపొందించబోతోంది. ఈ మాధ్యమాల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలను, , ఫేక్ (తప్పుడు) వార్తలు, పరువు ప్రతిష్టలను దిగజార్చే పోస్టింగులకు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త నిబంధనలు రానున్నాయి. జనవరి 15 లోగా ఇవి […]

సోషల్ మీడియాకు ఇక ' కళ్లెం ' .. ' నా ఇష్టం అంటే కుదరదు '..
Follow us

|

Updated on: Oct 22, 2019 | 5:52 PM

సోషల్ మీడియాకు ఇక ‘ బ్రేకులు ‘ పడనున్నాయి. ‘ నా ఇష్టం ‘ అంటూ ఈ మీడియాలో చెలరేగేవారికి ఇదో చేదు వార్త. సామాజిక మాధ్యమాలను నియంత్రించాల్సి ఉందని భావిస్తున్న కేంద్రం మరో మూడు నెలల్లో విధివిధానాలను రూపొందించబోతోంది. ఈ మాధ్యమాల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలను, , ఫేక్ (తప్పుడు) వార్తలు, పరువు ప్రతిష్టలను దిగజార్చే పోస్టింగులకు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త నిబంధనలు రానున్నాయి. జనవరి 15 లోగా ఇవి ఖరారు కానున్నాయి. ఈ మేరకు కేంద్రం మంగళవారం ఈ సరికొత్త విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది. కాగా-మద్రాస్, బాంబే, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో పెండింగులో ఉన్న అన్ని కేసులనూ అత్యున్నత న్యాయస్థానం తనంతట తానూ బదిలీ చేసుకుంది. జనవరి చివరివారంలో ఈ కేసులపై విచారణ జరపనుంది. ఫేస్ బుక్, వాట్సాప్ తమ కేసులను ఈ కోర్టుల నుంచి అత్యున్నత న్యాయస్థానానికి బదిలీ చేయాలని కోరుతూ వస్తున్నాయి. హైకోర్టుల్లో వీటిపై విచారణ జరిగితే అది దేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపవచ్ఛునని ఈ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఈ కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేసేందుకు ఈ సంస్థలు చేసిన ప్రయత్నాలను తమిళనాడు ప్రభుత్వం ఇప్పటివరకూ నిలువరిస్తూ వచ్చింది. విశ్లేషణ కోసం ప్రభుత్వం కోరే ఏ సమాచారాన్ని అయినా వాట్సాప్, ఫేస్ బుక్ సంస్థలు డీక్రిప్ట్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం తరఫు లాయర్, అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ అభ్యర్థించారు. ఈ సంస్థలు ఇండియాకు వచ్చాక.. తాము సమాచారాన్ని డీక్రిప్ట్ చేయలేమని అంటున్నాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. (ఇది ఈ కేసును సుప్రీంకోర్టుకు బదలాయించేందుకు తమిళనాడు అంగీకరించకముందు జరిగిన వాదన). అయితే సమాచారాన్ని డీక్రిప్ట్ చేసే ‘ కీ ‘ తమవద్ద లేదని అధికారులతో తాము సహకరించడం మాత్రమే చేయగల్గుతామని ఈ సంస్థలు పేర్కొన్నాయి. ఈ దశలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ బోస్ చమత్కారంగా ఓ వ్యాఖ్య చేశారు. ‘ ప్రభుత్వం ఓ ఇంటి యజమాని నుంచి కీ (తాళం) కోరుతోందని, కానీ ఆ యజమాని తన వద్ద అది లేదని అంటున్నాడని ‘ వారు అన్నారు. అటు-కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సోషల్ మీడియాకు నిబంధనలు ఖరారు చేయాలన్న ప్రతిపాదన ప్రజల ప్రయివసికి భంగం కల్గించాలన్న కుట్ర కాదని, దేశ భద్రత, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించాలన్నదేననీ స్పష్టం చేశారు.