Red Fort: ఈ నెల 31 వరకు ఎర్రకోట మూసివేత.. సందర్శకుల అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ..

Red Fort: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ యువరైతు

Red Fort: ఈ నెల 31 వరకు ఎర్రకోట మూసివేత.. సందర్శకుల అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ..
Follow us

|

Updated on: Jan 28, 2021 | 5:13 AM

Red Fort: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ యువరైతు బలయ్యాడు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్తాపడి మృతి చెందాడు. అంతేకాకుండా ఆందోళనకారులు ఎర్రకోటను ముట్టడించి ఆధ్మాత్మిక జెండాలను ఎగురవేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పురాతత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఎర్రకోటను ఈ నెల 31 వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రజలు సందర్శించేందుకు అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ట్రాక్టర్ల ర్యాలీ ఘటనతో రైతు సంఘాల నేతలు ఫిబ్రవరి 1న జరిగే పార్లమెంట్‌ మార్చ్‌ను రద్దు చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సాగు చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళనలు విరమించే ప్రసక్తే లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోసారి రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపడానికి సమయాత్తం అవుతోంది.

Navreet Singh: బంధువులకు విందివ్వడానికి వచ్చి విగతజీవిగా మారిపోయాడు.. ఉద్యమ రూపంలో యువకుడి బలి..