జ్యూస్ తాగి వస్తా.. చాక్లెట్ తినాలని ఉందని వెళ్లిన 13 ఏళ్ళ బాలుడు.. ఇంతలోనే..!

|

Oct 29, 2024 | 3:48 PM

జుంజును జిల్లా సూరజ్‌గఢ్ పట్టణంలోని 14వ వార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు హిమాన్షు అనే బాలుడు తన తల్లి వద్ద నుంచి రూ.100 తీసుకున్నాడు.

జ్యూస్ తాగి వస్తా.. చాక్లెట్ తినాలని ఉందని వెళ్లిన 13 ఏళ్ళ బాలుడు.. ఇంతలోనే..!
Firecracker
Follow us on

రాజస్థాన్‌లో ఓ 13 ఏళ్ల బాలుడు తన స్నేహితుడితో కలిసి రహస్యంగా పటాకులు కాల్చాడు. అయితే ఈ బాణసంచానే అతనికి మృత్యువుగా మారింది. పిల్లలిద్దరూ బాణాసంచా కాల్చగానే, దాని నిప్పురవ్వ 13 ఏళ్ల బాలుడి వైపు దూసుకు వచ్చింది. స్పార్క్ కారణంగా, పిల్లల ప్యాంటుకు మంటలు వ్యాపించాయి. అయితే అతని జేబులో ఉంచిన బాణసంచా కూడా నిప్పురవ్వ అంటుకుని పేలిపోయింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పాదాలు ముక్కలయ్యాయి. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలడు మృతి చెందాడు.

జుంజును జిల్లా సూరజ్‌గఢ్ పట్టణంలోని 14వ వార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు హిమాన్షు అనే బాలుడు తన తల్లి వద్ద నుంచి రూ.100 తీసుకున్నాడు. జ్యూస్ తాగాలని, చాక్లెట్ తినాలని ఉందని, తల్లిని నమ్మించడంతో కొడుక్కి డబ్బులు ఇచ్చింది. డబ్బులు తీసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు పని నిమిత్తం బయటకు వెళ్లారు. మరోవైపు, హిమాన్షు తన స్నేహితుల్లో ఒకరితో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ డబ్బుతో సల్ఫర్, పొటాష్ కొన్నాడు. ఈ పదార్థాన్ని పటాకులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు.

ఆ తర్వాత ఇద్దరూ హిమాన్షు ఇంట్లోనే ఆ మెటీరియల్‌తో పటాకులు తయారు చేశారు. పటాకులు తయారు చేసిన తర్వాత, హిమాన్షు, అతను వాటిని కాల్చారు. హిమాన్షు తన జేబులో కూడా కొన్ని పటాకులు దాచుకున్నాడు. ఇద్దరూ పటాకులు తీసుకుని గాజు సీసాలో పెట్టి కాల్చడం మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా అందులో నుంచి నిప్పురవ్వ వచ్చి హిమమాషు ప్యాంటు జేబులో పెట్టుకున్న బాణాసంచాకు తగిలి పేలింది. పటాకులు పేలడంతో హిమాన్షు తీవ్రంగా గాయపడ్డాడు.

హిమాన్షు రెండు కాళ్లు ముక్కలయ్యాయి. పిల్లల అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి వచ్చారు. వెంటనే ఈ విషయాన్ని హిమాన్షు కుటుంబ సభ్యులకు తెలిపారు. ముందుగా అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో, హిమాన్షును జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం ఇక్కడ చికిత్సపొందుతూ మృతి చెందాడు. ముగ్గురు సోదరీమణులలో హిమాన్షు ఒక్కడే సోదరుడు. చిన్నవాడు. తండ్రి ముఖేష్ కుమార్ కూలీగా పనిచేస్తున్నాడు. హిమాన్షు మృతితో కుటుంబం షాక్‌కు గురైంది. దీంతో ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..