Rajasthan Boy in borewell: రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాలో బోరు బావిలో పడ్డ నాలుగేళ్ల బాలుడిని సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 16 గంటల పాటు శ్రమించి బాలుడిని రక్షించాయి. బాలుడు ఆడుకుంటూ బోరు బావిలో పడిపోయాడు. సమచారం తెలుసుకున్న అధికారులు, సిబ్బంది వెంటనే.. బాలుడిన కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అయితే బాలుడు సురక్షితంగా బయటపడంతో అందరూ అధికారులను, సిబ్బందిని అభినందించారు. జాలోర్ జిల్లాలోని లచ్‌హ్రీ అనే గ్రామానికి చెందిన రైతు నాగారామ్ దేవాసీ తన వ్యవసాయ పొలంలో ఇటీవలే బోరు వేయించాడు. నాగారామ్ కొడుకు అనిల్ దేవాసీ గురువారం ఆడుకుంటూ బోరుబావి దగ్గరకు వెళ్లాడు. దానిపై కప్పి ఉంచిన వస్తువులను తీసేసి.. అందులోకి తొంగి చూశాడు. ప్రమాదవశాత్తు అందులో జారి పడిపోయాడు. సమీపంలో ఉన్న ఓ వ్యక్తి ఇదంతా గమనించి.. చుట్టుపక్కలవారికి విషయం చెప్పాడు. దీంతో వారు పోలీసులకు, అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు.
ఆ బావి 90 మీటర్ల లోతు ఉండటంతో బాలుడు పూర్తిగా కిందికి జారిపోయాడు. నాలుగేళ్ల నిల్ దేవాసీని రక్షించేందుకు బోరు బావికి సమాంతరంగా గొయ్యి తవ్వారు. సంఘటనా స్థలానికి కలెక్టర్, ఎస్పీలు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాలుడు క్షేమంగా ఉన్నాడని, బావిలోకి కెమెరాను పంపించి అతని కదలికలను గుర్తిస్తున్నామని స్థానిక స్టేషన్ ఆఫీసర్ కూడా ఉదయం వెల్లడించారు. పైపు ద్వారా ఆక్సిజన్‌ను అందించారు. గురువారం నుంచి కొనసాగుతున్న ఈ రెస్క్యూ సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు బాలుడ్ని సురక్షితంగా బయటకు తీయడంతో అందరూ హర్షం వ్యక్తంచేస్తున్నారు.
Also Read: