RBI Deputy Governor: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రబి శంకర్‌ .. ప్రకటించిన కేంద్ర కేబినెట్‌ నియామకాల కమిటీ

|

May 02, 2021 | 12:34 PM

RBI Deputy Governor: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) డిప్మూటీ గవర్నర్‌గా టి. రబీ శంకర్‌ నియామకం అయ్యారు. అయితే ఆయన నియామకంపై కేంద్ర కేబినెట్‌కు చెందిన?.

RBI Deputy Governor: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రబి శంకర్‌ .. ప్రకటించిన కేంద్ర కేబినెట్‌ నియామకాల కమిటీ
Follow us on

RBI Deputy Governor: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) డిప్మూటీ గవర్నర్‌గా టి. రబీ శంకర్‌ నియామకం అయ్యారు. అయితే ఆయన నియామకంపై కేంద్ర కేబినెట్‌కు చెందిన నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. అయితే మూడు సంవత్సరాల పాటు ఆయన ఆ పదవీలో కొనసాగనున్నారు. ప్రస్తుతం రబి శంకర్‌ పేమెంట్స్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. గత నెల 2వ తేదీన బీపీ కనుగో రిటైర్డ్‌ అయిన తర్వాత ఈ డిప్యూటీ గవర్నర్‌ పోస్టు ఖాళీగా ఉంది. అయితే శంకర్‌ కాకుండా ఇప్పటికే మహేష్‌ కుమార్‌ జైన్‌, మైకేల్‌ పాత్రా, రాజేశ్వర్‌ రావు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌లుగా ఉన్నారు. పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌, పబ్లిక్‌ డెట్‌ మేనేజ్‌మెంట్‌, మానిటరీ ఆపరేషన్లలో శంకర్‌కు మంచి పట్టుంది. కాగా, శంకర్‌ బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం నుంచి సైన్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీని పొందారు. ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ గ్రోత్‌ నుంచి డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌లో డిప్లొమా కూడా ఉంది. 2020లో శంకర్‌ను ఇండియన్‌ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ అండ్‌ అలైడ్‌ సర్వీసెస్‌ (ఇఫ్టాస్‌) చైర్మన్‌గా నియామకం అయ్యారు. అయితే ఇఫ్టాస్‌ ఆర్బీఐలోని అనుబంధ సంస్థ. గతంలో బంగ్లాదేశ్‌ , కేంద్ర మరియు ప్రభుత్వ బ్యాంకు కోసం బాండ్‌ మార్కెట్‌ అభివృద్ధిపై అంతర్జాతీయ ద్రవ్య నిధితో శంకర్‌ పని చేశారు.

ఇవీ కూడా చదవండి:

SBI Account Holders: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఇక ఆ పనుల కోసం బ్రాంచ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు

Amazing Facts: పశ్చిమబెంగాల్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు.. హౌరా నుంచి ఎస్‌బీఐ వరకు అన్ని ఆశ్యర్యపరిచే అంశాలే..!

మ్యూచువల్‌ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారా..? రూ.10 వేలతో రూ.5 లక్షలు.. అదిరిపోయే స్కీమ్‌..