PM Narendra Modi: యూపీలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు.. ప్రతిష్ఠాత్మక బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభోత్సవంతో పాటు..

|

Jul 13, 2022 | 6:47 PM

PM Modi UP Visit: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ (PM Narendra Modi) ఈనెల 16న ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. దాదాపు రూ.14,850 కోట్లతో 296 కిలోమీటర్ల నాలుగు లేన్‌ల ప్రతిష్ఠాత్మక బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని ప్రారంభించనున్నారు

PM Narendra Modi: యూపీలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు.. ప్రతిష్ఠాత్మక బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభోత్సవంతో పాటు..
Pm Narendra Modi
Follow us on

PM Modi UP Visit: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ (PM Narendra Modi) ఈనెల 16న ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. దాదాపు రూ.14,850 కోట్లతో 296 కిలోమీటర్ల నాలుగు లేన్‌ల ప్రతిష్ఠాత్మక బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈమేరకు జలౌన్‌ జిల్లాలోని తహసిల్‌లోని కైతేరి గ్రామంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని ఈ ఎక్స్‌ప్రెస్‌ వేను మోడీ ప్రారంభించనున్నట్లు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ‘దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచడానికి కేంద్రం ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందులో ప్రధానమైన అంశం రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం. 2020 ఫిబ్రవరి 29న బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేశారు. కేవలం 28 నెలల్లోనే దీని పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రధానమంత్రి ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించనున్నారు’ అని పీఎంవో తెలిపింది.

ఏడు జిల్లాల మీదుగా..
కాగా ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (UPEIDA) ఆధ్వర్యంలో సుమారు రూ. 14,850 కోట్లతో 296 కి.మీ., నాలుగు లేన్‌ల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించారు. దీనిని ఆరు లేన్‌ల వరకు కూడా విస్తరించవచ్చు. ఇది చిత్రకూట్ జిల్లాలోని భరత్‌కూప్ సమీపంలోని గోండా గ్రామం వద్ద NH 35 నుండి ఎటావా జిల్లాలోని కుడ్రైల్ గ్రామం వరకు విస్తరించి ఉంది. అక్కడ అది ఆగ్రా- లక్నో ఎక్స్‌ప్రెస్‌వేతో కలిసిపోతుంది. చిత్రకూట్, బందా, మహోబా, హమీర్‌పూర్, జలౌన్, ఔరైయా, ఇటావా వంటి జిల్లాల మీదుగా ఈ హైవే వెళుతుంది. ఈ ప్రాంతంలో కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు, బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ఆర్థిక అభివృద్ధికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందని కేంద్రం చెబుతోంది. ఈ కారిడార్‌ కారణంగా స్థానికులకు వేలాది ఉద్యోగాలు వస్తాయంటోంది. ఇక బుందేల్‌ ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వే పక్కనే ఉన్న బందా, జలౌన్ జిల్లాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..