PM Narendra Modi: ఎన్డీఏ చారిత్రాత్మక నిర్ణయం.. ద్రౌపది ముర్మును ప్రత్యేకంగా ప్రశంసించిన ప్రధాని మోడీ..

|

Jul 03, 2022 | 12:22 PM

కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు ప్రధాని మోడీ ముర్ము గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక నిర్ణయమని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

PM Narendra Modi: ఎన్డీఏ చారిత్రాత్మక నిర్ణయం.. ద్రౌపది ముర్మును ప్రత్యేకంగా ప్రశంసించిన ప్రధాని మోడీ..
Doupadi Murmu Pm Modi
Follow us on

PM Modi lauds Droupadi Murmu: బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అభ్యర్థి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఇది భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక నిర్ణయమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజున ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు ప్రధాని మోడీ ముర్ము గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, ఆమె జీవిత ప్రయాణం గురించి ప్రధాని చాలా గొప్పగా మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆమె రాజకీయ ప్రయాణం, ఒత్తిడిని ధిక్కరించి మరి జీవితాంతం పోరాడిన అంశాలను ప్రస్తావించిన మోడీ.. ఆమె అన్నింటిని ధీటుగా ఎదురొడ్డి సాధించడంలో విఫలం కాలేదని ప్రశంసించారు. సమాజంలోని ప్రతి వర్గం అభ్యున్నతి కోసం ముర్ము నిరంతరం ఎలా పనిచేశారో వివరించారు. దీంతోపాటు ప్రజా జీవితంలో ముర్ము ప్రవర్తన గురించి కూడా ప్రధాని మోడీ ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో ఆమె ఎన్నికైతే, భారతదేశానికి మొదటి గిరిజన మహిళ అధ్యక్షురాలు కావడం నిజంగా గర్వకారణమని, ఆమె అభ్యర్థిత్వం రాజకీయాలకు అతీతంగా నిలుస్తుందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులతో ప్రధాని మోడీ పేర్కొన్నారు.

కాగా.. జూన్ 24న ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, ఎన్డీఏ నేతృత్వంలోని కూటమి పార్టీలు బిజు జనతా దళ్ (బీజేడీ), వైసీపీ (YSRCP) నేతల సమక్షంలో ద్రౌపది ముర్ము తన నామినేషన్‌ను దాఖలు చేశారు. నామినేషన్ వేసినప్పటి నుంచి తనకు మద్దతివ్వాలని ముర్ము బీజేపీతోపాటు విపక్షాలను కోరారు. ముర్ము స్వయంగా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌లకు ఫోన్ చేసి మాట్లాడారు.

కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ, శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) సుఖ్‌బీర్ బాదల్‌లకు జేపీ నడ్డా ఫోన్ చేసి మాట్లాడారు.

ఇవి కూడా చదవండి

కాగా.. NDA కూటమిలోని మాజీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ (SAD), HD దేవేగౌడ పార్టీ జనతాదళ్ (సెక్యులర్) ముర్ముకి మద్దతు ప్రకటించాయి. భారత రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరగనున్నాయి. జూలై 21న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24న ముగియనుంది. కాగా.. విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఆయన కూడా తనకు మద్దతివ్వాలంటూ ఇప్పటికే పలు పార్టీల నేతలతో మాట్లాడటంతోపాటు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.

జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..