PM Modi in Odisha: ఆవాస్‌ యోజన ఇంటిలో పుట్టినరోజు జరుపుకున్న ప్రధాని మోదీ

|

Sep 17, 2024 | 12:55 PM

తన పుట్టిన రోజు సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒడిశా రాష్ట్రాన్ని సందర్శించారు. భువనేశ్వర్‌లో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద కేటాయించిన ఇళ్లను ఆయన స్వయంగా సందర్శించారు.

PM Modi in Odisha: ఆవాస్‌ యోజన ఇంటిలో పుట్టినరోజు జరుపుకున్న ప్రధాని మోదీ
Pm Modi In Odisha
Follow us on

తన పుట్టిన రోజు సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒడిశా రాష్ట్రాన్ని సందర్శించారు. భువనేశ్వర్‌లో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద కేటాయించిన ఇళ్లను ఆయన స్వయంగా సందర్శించారు. అక్కడి మహిళలతో మాట్లాడారు. ప్రధానిని ఒడిశా ప్రజలు సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. వారి ఇంటిలో ప్రధాన మంత్రి పూజ చేశారు. వారందించిన జగన్నాథుడిని చిత్రపటాన్ని, పాయసాన్ని స్వీకరించారు. ప్రధాని మోదీ వెంట ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చంరణ్‌ మాఝీ కూడా ఉన్నారు.

తన పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ మహిళల కోసం ఒడిశా ప్రభుత్వం చేపట్టిన సుభద్ర పథకాన్ని ప్రారంభించారు. భువనేశ్వర్‌లో నిర్వహించిన ఈ పథకం కింద అర్హులైన లబ్దిదారులకు ఏటా రెండు వాయిదాల్లో ఐదు వేల చొప్పున మొత్తం పదివేల రూపాయలు చెల్లిస్తారు. ఏటా రాఖీ పండగ రోజు ఒకసారి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న మరో విడత చెల్లిస్తారు. 21 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల లోపు మహిళలు ఈ పథకం కింద అర్హులు. ఈ పథకం కింద ఇప్పటికే 50 లక్షల మంది మహిళలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల పరిధిలో అత్యధిక డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించే వంద మంది లబ్దిదారులకు అదనపు ఇన్సెంటివ్‌గా ఐదొందలు చెల్లిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..