PM Kisan Scheme: మీ ఖాతాలో 11వ విడత డబ్బులు పడేది అప్పుడే.. మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!

|

Apr 17, 2022 | 6:28 AM

PM Kisan Scheme: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 11వ విడత డబ్బుల కోసం ఎదురు చూసే రైతులకు శుభవార్త. 11వ విడత సొమ్మును కేంద్ర ప్రభుత్వం

PM Kisan Scheme: మీ ఖాతాలో 11వ విడత డబ్బులు పడేది అప్పుడే.. మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!
Pm Kisan
Follow us on

PM Kisan Scheme: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 11వ విడత డబ్బుల కోసం ఎదురు చూసే రైతులకు శుభవార్త. 11వ విడత సొమ్మును కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మీ ఖాతాకు బదిలీ చేయనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పీఎం కిసాన్ పథకం డబ్బులను ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నారు. అయితే, ఈ పథకానికి సంబంధించి రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే.. టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించవచ్చు. అలాగే, 11వ విడత డబ్బు మీ ఖాతాలో వస్తుందా? లేదా? అనే మీ స్టేటస్‌ను కూడా చెక్ చేసుకోండి.

స్టేటస్‌ను ఇలా చెక్ చేయండి..
1. ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
2. ఈ వెబ్‌సైట్‌కి కుడి వైపున ఉన్న ఫార్మర్స్ కార్నర్‌పై క్లిక్ చేయండి.
3. ఇప్పుడు మీరు బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయాలి.
4. మీ స్టేటస్‌ను చెక్ చేయడానికి ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ వంటి అన్ని వివరాలను పూరించాలి.
5. ప్రక్రియ పూర్తయిన తర్వాత జాబితాలో మీ పేరును చెక్ చేసుకోవాలి.

కాగా, జనవరి 1, 2022న పీఎం కిసాన్ సమ్మా్న్ నిధి పథకం కింద 10వ విడత సొమ్మును దేశ వ్యాప్తంగా ఉన్న 10.09 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పడింది. మొత్తం 20,900 కోట్ల సొమ్ము బదిలీ అయ్యింది.

6000 రూపాయలు..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు ఏటా 6000 రూపాయలు లభిస్తాయి. 2 వేల రూపాయల చొప్పున 3 వాయిదాలలో చెల్లించబడుతుంది. ఈ డబ్బు నేరుగా రైతుల ఖాతాలకు బదిలీ చేయబడుతుంది.

సమస్యలుంటే ఈ నెంబర్‌ను సంప్రదించవచ్చు..
ఈ స్కీమ్‌కు సంబంధించి మీకు ఏవైనా సమస్యలు ఉంటే హెల్ప్‌లైన్ నంబర్‌ 011-23381092, 155261 ను సంప్రదించవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 1800115526లో కూడా సంప్రదించవచ్చు.

Also read:

Delhi Files – Vivek Agnihotri: ఇక ‘ఢిల్లీ ఫైల్స్’.. సంచలన ప్రకటన చేసిన వివేక్ అగ్నిహోత్రి..

Viral Video: ఈ రైతు చాలా స్మార్ట్ గురూ.. పొలం పనుల్లో సరికొత్త ప్రయోగం.. మీకూ ఉపయోగపడొచ్చు ఓ లుక్కేయండి..!

Russia – Ukraine War: పుతిన్‌కు ఆగ్రహం కలిగించిన ఆ ఘటన.. సైన్యానికి కీలక ఆదేశాలు జారీ..!