Agnipath: అగ్నిపథ్ అల్లర్లపై సుప్రీంకోర్టులో పిటిషన్.. పథకం ప్రకారమే విధ్వంసం

|

Jun 18, 2022 | 1:50 PM

అగ్నిపథ్ వ్యతిరేక అల్లర్లపై సిట్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టులో(Supreme Court) పిటిషన్ దాఖలైంది. అగ్నిపథ్ పథకం కారణంగా తలెత్తే ప్రభావం, పర్యవసానాలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి...

Agnipath: అగ్నిపథ్ అల్లర్లపై సుప్రీంకోర్టులో పిటిషన్.. పథకం ప్రకారమే విధ్వంసం
Supreme Court Main
Follow us on

అగ్నిపథ్ వ్యతిరేక అల్లర్లపై సిట్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టులో(Supreme Court) పిటిషన్ దాఖలైంది. అగ్నిపథ్ పథకం కారణంగా తలెత్తే ప్రభావం, పర్యవసానాలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని పిటిషన్లో పిటిషనర్ కోరారు. కాగా.. సికింద్రాబాద్(Secunderabad) లో అగ్నిపథ్‌ ఆందోళన అప్పటికప్పుడు జరిగింది కాదు. ఈ విధ్వంసానికి వారం రోజుల ముందునుంచి ప్రిపరేషన్ జరిగినట్లు తెలుస్తోంది. వాట్సప్‌ గ్రూపుల్లో ఆందోళనకారులు కో ఆర్డినేషన్ చేసుకున్నారు. ఎవరెవరు.. ఎప్పుడు.. ఎక్కడికి ఎలా చేరాలో పక్కా పథకం రూపొందించుకున్నారు. ఆ తర్వాతే విధ్వంసం సృష్టించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ వెనుక సాయి డిఫెన్స్ అకాడమీ(Sai Defence Academy) కీ రోల్ పోషించినట్టు తెలుస్తోంది. నిరసన ర్యాలీకి సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావు హాజరవుతారని.. అందరూ కలిసి ఆయనకు సపోర్ట్‌ చేయాలని గ్రూప్‌లో ఉన్న సభ్యులు డిసైడ్‌ అయ్యారు. టీవీ9 చేతికి చిక్కిన వాట్సప్‌ గ్రూప్‌ ఆధారాల్లో ఇదే విషయం స్పష్టమైంది.

రోజంతా ఆందోళనలతో అట్టుడికిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నార్మల్‌ పరిస్థితికి చేరుకుంది. పరిస్థితి అదుపులోకి రావడంతో స్టేషన్‌ పరిసరాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్​నుంచి తరలించారు. రాత్రి 7 గంటలకు స్టేషన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. రైల్వే అధికారులకు రైళ్లను పునరుద్దరించారు. దాదాపు 9 గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచి పోయాయి. పరిస్థితులు సద్దుమణగడంతో రైల్వే అధికారులు షెడ్యూల్‌ రైళ్లను తిరిగి ప్రారంభించారు.

ఆర్మీ నియామకల్లో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నిరసనకారులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు పెద్ద ఎత్తున రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. ప్రాథమిక అంచనాల మేరకు సుమారు రూ. 7 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. భారీ ఎత్తున పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను చెదరగొట్టడంతో ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. దీంతో పోలీసులు ఆందోళనకారులపై చర్యలు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి