Omicron Restrictions: మళ్లీ కర్ఫ్యూ, లాక్‌డౌన్ దిశగా పయనిస్తున్న రాష్ట్రాలు.. కీలక నిర్ణయం తీసుకున్న బెంగాల్ సర్కార్..

|

Jan 02, 2022 | 9:22 PM

Omicron Restrictions: కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ ఊపందుకుంది. దానికి ఒమిక్రాన్ తోడైంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి.

Omicron Restrictions: మళ్లీ కర్ఫ్యూ, లాక్‌డౌన్ దిశగా పయనిస్తున్న రాష్ట్రాలు.. కీలక నిర్ణయం తీసుకున్న బెంగాల్ సర్కార్..
Follow us on

Omicron Restrictions: కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ ఊపందుకుంది. దానికి ఒమిక్రాన్ తోడైంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. తాజాగా బెంగాల్‌ ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది. దేశంలో ఒమిక్రాన్​ ధాటికి ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఆంక్షల బాట పట్టాయి. తాజాగా ఈ జాబితాలో చేరింది వెస్ట్‌బెంగాల్. బెంగాల్‌లో ఇవాళ్టి నుంచి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది మమత సర్కార్. అంతేకాదు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు పలు నిర్ణయాలకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆఫీసులు కూడా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు 50 శాతం సిబ్బందితోనే పనిచేయాలని స్పష్టం చేసింది బెంగాల్ ప్రభుత్వం. పలు నగరాలకు విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. వారానికి రెండు రోజులు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపింది. యూకే నుంచి వచ్చే విమానాలను అనుమతించేది లేదని స్పష్టం చేసింది మమతా సర్కార్.

50 శాతం సామర్థ్యంతో రాత్రి 7 గంటల వరకు లోకల్​ట్రెయిన్స్​రాకపోకలకు అనుమతించింది బెంగాల్ ప్రభుత్వం. ఇక దూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని చెప్పారు అధికారులు. అటు ఒడిశాలో కూడా ఆంక్షలు విధించారు అధికారులు. ప్రాథమిక పాఠశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కరోనా వ్యాప్తి దృష్ట్యా 1 నుంచి 5వ తరగతి పిల్లలకు ఆన్​లైన్​లోనే పాఠాలు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇవాళ ప్రాథమిక పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఆ లోపే ఈ ఆదేశాలు జారీ చేసింది ఒడిశా. అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. అయితే, కొవిడ్​ కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో చాలావరకు అంత తీవ్రత లేదని, ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన అవసరం లేదని చెప్పారాయన.

Also read:

Telangana Omicron: తెలంగాణలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌.. పెరుగుతున్న కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..

Omicron: హోమ్‌ టెస్ట్‌ ద్వారా ఒమిక్రాన్‌ని గుర్తించవచ్చా..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Tea: చాయ్‌లో పాలు ఎందుకు కలుపుతారో తెలుసా.. దీని వెనుక ఓ పెద్ద సైన్స్ ఉంది.. అదేంటో తెలుసా..