Nupur Sharma Remarks Row: మాజీ బీజేపీ నేత నూపుర్ శర్మ టీవీ చర్చ సందర్భంగా మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల వివాదాం ఇంకా కొనసాగుతూనే ఉంది. మహ్మద్ ప్రవక్త పై చేసిన వ్యాఖ్యల కారణంగా బీజేపీ నుంచి నూపుర్ శర్మ సస్పెన్షన్‌కు గురైంది. అంతేకాదు.. నూపుర్ శర్మ చంపిన వారికి పలువురు రివార్డ్ ప్రకటించి సంచలనం సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి నుపుర్ శర్మ నాలుకను కత్తిరిస్తే రూ.2 కోట్ల రివార్డు ప్రకటించించి సంచలనం సృష్టించాడు. అంతేకాదు ఆ వీడియో సోషల్ మాధ్యమంలో ఓ రేంజ్ లో చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో వ్యక్తిపై కేసు నమోదైంది. ఒకరోజు క్రితం కేసు నమోదైన వ్యక్తిని నుహ్‌లోని పోలీసులు అరెస్టు చేశారు.
హర్యానా రాష్ట్రం సలాహేరి నివాసి ఇర్షాద్ ప్రధాన్.. నూపుర్ శర్మ నాలికను కత్తిరిస్తే.. రివార్డు ప్రకటించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి చేరుకుంది. దీంతో నిందితుడు ఇర్షాద్ ప్రధాన్‌పై గురువారం కేసు నమోదు చేశారు. నూపుర్ శర్మ నాలుక కోసేందుకు నిందితుడు రివార్డు ప్రకటించిన ఇర్షాద్ ను అరెస్టు చేసి, విచారిస్తున్నామని పోలీసులు ప్రకటించారు. శనివారం కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత అతనిని పోలీసు రిమాండ్‌కు తరలిస్తామని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ వరుణ్ తెలిపారు.
శర్మ నాలుకను కత్తిరించమని ఇర్షాద్ ప్రధాన్ భారీ మొత్తాన్ని మేవాత్ తరపున యూట్యూబర్‌కు రివార్డ్‌ను అందిస్తున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ కావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. “ఆమె నాలుక తెచ్చి రూ. 2 కోట్లు తీసుకోండి. అది చేసి ఇప్పుడే డబ్బు తీసుకోండి” అని ఇర్షాద్ ప్రధాన్ వీడియోలో చెప్పినట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..