Covid-19 Vaccination: మరో ఏడు రాష్ట్రాలకు కొవాగ్జిన్‌ టీకా పంపిణీ.. ఇప్పటి వరకు ఎంత మందికి టీకా వేశారంటే..

covid-19 vaccination: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 15,37,190 మందికి టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శుక్రవారం

  • Subhash Goud
  • Publish Date - 8:50 pm, Sat, 23 January 21
Covid-19 Vaccination: మరో ఏడు రాష్ట్రాలకు కొవాగ్జిన్‌ టీకా పంపిణీ.. ఇప్పటి వరకు ఎంత మందికి టీకా వేశారంటే..

covid-19 vaccination: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 15,37,190 మందికి టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శుక్రవారం ఒక్క రోజే 1,46,459 మందికి టీకా వేసినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 13 దేశాలకు వ్యాక్సిన్‌ పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ జాబితాలో బెహ్రెయిన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, బ్రెజిల్‌, మాల్దీవులు, మారిషన్‌, మంగోలియా, మొరాకో, మయన్మార్‌, నేపాల్‌, శ్రీలంక, ఒమన్‌ ఉన్నాయి. అయితే భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌ను ఇప్పటికే 12 రాష్ట్రాల్లో పంపిణీ చేస్తుండగా, అదనంగా మరో ఏడు రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు వెల్లడించింది. వచ్చేవారం నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఝర్ఖండ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, పంజాబ్‌, బెంగాల్‌లలో కూడా కొవాగ్జిన్‌ టీకాను అందించనున్నట్లు తెలిపింది. అలాగే శనివారం ఏపీలో 11,562 టీకాలు వేసినట్లు తెలిపింది.

కాగా, ఏడాది పాటు ఇబ్బందులకు గురి చేసిన కరోనా మహమ్మారి కట్టడికి భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం వ్యాక్సిన్‌ తయారీకి తీవ్రంగా శ్రమించాయి. ఏడాది తర్వాత వ్యాక్సిన్‌ను అందుబాటులోకి వచ్చింది. గత వారం రోజులుగా భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి సమస్య రాలేదని కేంద్రం తెలిపింది.

Also Read: Corona Vaccines: కరోనా వ్యాక్సిన్‌ ఎగుమతిని ముమ్మరం చేసిన భారత్‌.. ముందస్తు ఒప్పందాల ప్రకారం ఇతర దేశాలకు పంపిణీ