యమధర్మరాజు గెటప్‌లో కళాకారుడు హల్‌చల్‌.. కరోనా అవగాహన కోసమేనట..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ కళాకారుడు యమధర్మరాజు గెటప్‌లో రోడ్లపై ప్రత్యక్షమయ్యాడు.

యమధర్మరాజు గెటప్‌లో కళాకారుడు హల్‌చల్‌.. కరోనా అవగాహన కోసమేనట..
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2020 | 10:13 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ కళాకారుడు యమధర్మరాజు గెటప్‌లో రోడ్లపై ప్రత్యక్షమయ్యాడు. నాలుగు రోడ్ల కూడలిలో ఉండి.. ప్రజలకు కరోనా అవగాహన వచ్చేలా ప్రయత్నించాడు. ఈ సంఘటన జమ్ముకశ్మీర్‌లోని ఉదాంపూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. సదరు కళాకారుడిని ఓ జాతీయ మీడియా ప్రశ్నించగా.. ప్రజల్లో కరోనా గురించి ఇంకా కూడా అవగాహన రావడం లేదని.. ప్రభుత్వాలు చెప్పినప్పటికీ.. ఇంకా కూడా ప్రజలు బయట తిరుగుతున్న సమయంలో మాస్క్‌లు ధరించడం లేదని.. కనీసం సోషల్ డిస్టెన్స్‌ కూడా పాటించడం లేదని వాపోయాడు. అందుకే ప్రజల్లో ఇలానైనా అవగాహన వస్తుందన్న ఆశతో ఇలా చేశానని సదరు కళాకారుడు దీపక్ కుమారన్ తెలిపారు. మాస్క్‌ ధరించకపోతే నా వెంట తీసుకుపోతా.. సోషల్ డిస్టోన్స్‌ పాటించకపోతే నా వెంట తీసుకుపోతా అంటూ సదరు కళాకారుడు నాలుగు రోడ్ల కూడలి వద్ద ఉండి ప్రజల్లో అవగాహన వచ్చేలా ప్రయత్నించాడు.