Maharashtra Corona : మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. రాష్ట్రంలో ఒక్క రోజే 11 వేల పాజిటివ్ కేసులు..

|

Jan 02, 2022 | 8:18 PM

Maharashtra Corona: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఒక్క మహారాష్ట్రలోనే రికార్డ్ స్థాయిలో 11 వేలకు పైగా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశమంతా ఒక ఎత్తైతే.. మహారాష్ట్రలో మరో ఎత్తు అన్నట్లుగా పరిస్థితి ఉంది.

Maharashtra Corona : మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. రాష్ట్రంలో ఒక్క రోజే 11 వేల పాజిటివ్ కేసులు..
Corona
Follow us on

Maharashtra Corona: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఒక్క మహారాష్ట్రలోనే రికార్డ్ స్థాయిలో 11 వేలకు పైగా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశమంతా ఒక ఎత్తైతే.. మహారాష్ట్రలో మరో ఎత్తు అన్నట్లుగా పరిస్థితి ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,877 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 50 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. తాజాగా నమోదైన ఒమిక్రాన్ కేసులతో మహారాష్ట్రలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 510కి చేరింది. మహారాష్ట్రలో కరోనా కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 2,069 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 42,024 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక తాజాగా మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో 8,036 పాజిటివ్ కేసులు ముంబైలోనే నమోదయ్యాయి. దాంతో ముంబై అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది.

ఇదిలాఉంటే.. కేరళలో ఇవాళ 45 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో ఒమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య 152కి చేరింది. ఇక దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 1,525కి చేరింది. ఇప్పటి వరకు దేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఒమిక్రాన్ కొత్త కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 560 మంది కోలుకున్నారని కూడా ప్రకటించింది.

Also read:

Telangana Omicron: తెలంగాణలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌.. పెరుగుతున్న కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..

Omicron: హోమ్‌ టెస్ట్‌ ద్వారా ఒమిక్రాన్‌ని గుర్తించవచ్చా..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Tea: చాయ్‌లో పాలు ఎందుకు కలుపుతారో తెలుసా.. దీని వెనుక ఓ పెద్ద సైన్స్ ఉంది.. అదేంటో తెలుసా..