Maharashtra Political Crisis: విధులను మరిచారు.. రెబల్ ఎమ్మెల్యేలపై బాంబే హైకోర్టులో పిల్ దాఖలు

|

Jun 27, 2022 | 12:17 PM

Maharashtra Political Crisis Updates: ఏక్‌నాథ్ శిండే వర్గం తిరుగుబాటుతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఏక్‌నాథ్ శిండే‌తో పాటు మిగిలిన రెబెల్ ఎమ్మెల్యేలపై బాంబే హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వాజ్యం (PIL) దాఖలయ్యింది.

Maharashtra Political Crisis: విధులను మరిచారు.. రెబల్ ఎమ్మెల్యేలపై బాంబే హైకోర్టులో పిల్ దాఖలు
Bombay High Court
Follow us on

Maharashtra Political Crisis Updates: ఏక్‌నాథ్ శిండే వర్గం తిరుగుబాటుతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మెడపై కత్తి వేలాడుతోంది. ఎంవీఏ కూటమి సర్కారు ఎన్ని రోజులు అధికారంలో కొనసాగుతుందన్న సస్పెన్స్ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ శిండే‌తో పాటు మిగిలిన రెబెల్ ఎమ్మెల్యేలపై బాంబే హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వాజ్యం (PIL) దాఖలయ్యింది. తమ విధులను నిర్వర్తించడంలో వీరు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారంటూ పిటిషనర్ తన పిల్‌లో ఆరోపించారు. నియోజకవర్గ ప్రజల బాగోగులు చూడాల్సిన ఎమ్మెల్యేలు ఇప్పుడు అసోంలో మకాం పెట్టారని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు.  దీంతో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వీరు తక్షణమే తమ విధులను నిర్వర్తించేలా ఆదేశాలివ్వాలంటూ పిటిషనర్ బాంబే హైకోర్టును కోరారు.

ఇదిలా ఉండగాఅనర్హత వేటు ఎందుకు వేయకూడదంటూ డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన నోటీసుపై రెబల్ శివసేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్ శిండే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మరికాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరపనుంది. తన స్థానంలో శివసేన శాసనసభాపక్ష నేతగా అజయ్ చౌదరీని నియమించడాన్ని కూడా ఏక్‌నాథ్ శిండే కోర్టులో సవాలు చేశారు. జస్టిస్ సూర్య కాంత్, జేపీ పర్దివాలా నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈ పిటిషన్లను మధ్యాహ్నం 12 గం.ల నుంచి 12.30 గం.ల మధ్య విచారణ జరపనుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇవ్వనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంటోంది.

అటు రెబల్ ఎమ్మెల్యేలతో గౌహాతిలోని హోటల్‌లో ఈ రోజు మధ్యాహ్నం 2 గం.లకు ఏక్‌నాథ్ శిండే భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చించనున్నారు.

ఇవి కూడా చదవండి

పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలో 40 ఏళ్లుగా ఉన్న వారు.. ఇప్పుడు పారిపోయారని ఎద్దేవా చేశారు. వారు ఇప్పుడు ఆత్మ లేని జీవశ్ఛవాలుగా భివర్ణించారు.  ఎవరి మనోభిప్రాయాలను గాయపరిచే ఉద్దేశం తనకు లేదని.. తాను నిజాన్ని మాత్రమే చెబుతున్నట్లు చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..