Maharashtra Cabinet: బీజేపీ – శివసేన పంపకాలు పూర్తి.. మహారాష్ట్ర కొత్త క్యాబినేట్ ఇదే..

|

Aug 09, 2022 | 12:29 PM

మహారాష్ట్ర కేబినేట్‌లో మొత్తం 18 మందికి అవకాశం లభించింది. శివసేన నుంచి 9, బీజేపీ నుంచి 9 మందికి అవకాశం లభించింది. మంగళవారం ముంబైలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Maharashtra Cabinet: బీజేపీ - శివసేన పంపకాలు పూర్తి.. మహారాష్ట్ర కొత్త క్యాబినేట్ ఇదే..
Maharashtra Cabinet
Follow us on

Maharashtra Cabinet Expansion: ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దాదాపు నెల రోజుల తర్వాత కేబినేట్ విస్తరణ జరిగింది. మహారాష్ట్ర కేబినేట్‌లో మొత్తం 18 మందికి అవకాశం లభించింది. శివసేన నుంచి 9, బీజేపీ నుంచి 9 మందికి అవకాశం లభించింది. మంగళవారం ముంబైలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరితో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ప్రమాణం చేయించారు. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిన 40 రోజుల తర్వాత ఈ మంత్రివర్గ విస్తరణ జరిగింది.

మహారాష్ట్ర క్యాబినేట్ ఇదే..

ఇవి కూడా చదవండి

బీజేపీ నుంచి.. చంద్రకాంత్ పాటిల్, సుధీర్ ముంగంటివార్, గిరీష్ మహాజన్, సురేశ్ ఖాడే, రాధాకృష్ణ విఖే పాటిల్, రవీంద్ర చవాన్, మంగళ్ ప్రభాత్ లోధా, విజయ్‌కుమార్ గవిత్, అతుల్ సేవ్‌కు అవకాశం లభించింది. శివసేన శిబిరం నుంచి దాదా భూసే, సందీపన్ బుమ్రే, ఉదయ్ సమంత్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్, దీపక్ కేసర్కర్, గులాబ్రావ్ పాటిల్, సంజయ్ రాథోడ్, శంభురాజే దేశాయ్ ప్రమాణం చేశారు.

ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి షిండే తన క్యాంపు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. 55 మంది సేన ఎమ్మెల్యేలలో 40 మంది ఆయనకు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. కాగా.. కేబినేట్ విస్తరణకు ముందు దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ అగ్రనేతలతో పలుమార్లు భేటీ అయ్యారు. అనంతరం పేర్లను ఖరారు చేశారు.

ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంమంత్రిత్వశాఖ బాధ్యతలు లభించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..