భారత అమ్ములపొదిలోకి మరో అస్ర్తం చేరుతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఎల్‌సీహెచ్ కాసేపట్లో లాంఛనంగా భారత వైమానిక దళంలో చేరనున్నాయి. అనేక రకాల క్షిపణులు, ఇతర ఆయుధాలను ప్రయోగించగల ఈ లైట్ కంబాట్ హెలికాపర్ల రాకతో వాయుసేన సత్తా మరింత పెరిగింది. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో జరిగే వేడుకలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌధరిలు ఈ హెలికాప్టర్లను లాంఛనంగా వాయుసేనలో ప్రవేశపెడతారు. ఎల్‌సీహెచ్‌ను ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఏఎల్ అభివృద్ధి చేసింది.
ప్రధానంగా వీటిని పర్వత ప్రాంతాల్లో మోహరించేలా రూపొందించారు. 5.8 టన్నుల బరువున్న ఈ హెలికాప్టర్‌లో రెండు ఇంజిన్లు ఉన్నాయి. శత్రు రాడార్లను బోల్తా కొట్టించే స్టెల్త్ సామర్థ్యం దీని సొంతం. రాత్రిపూట కూడా ఇది పోరాడగలదు. నేలను బలంగా తాకినా తట్టుకోగల దృఢ ల్యాండింగ్ గేర్‌ను దీనికి ఏర్పాటు చేశారు. అన్నిరకాల వాతావరణాల్లోనూ ఇది గగన విహారం చేయగలదు. గాల్లో అద్భుత విన్యాసాలు చేస్తూ శత్రువును గందరగోళానికి గురిచేస్తుంది.
భారతదేశం ఇటీవల యుఎస్ నుంచి చాలా అధునాతన హెలికాప్టర్ అపాచీని కొనుగోలు చేసిన సంగతి తెలిసందే.. అయితే కార్గిల్, సియాచిన్ శిఖరాలపై టేకాఫ్, ల్యాండింగ్‌లో అపాచీ కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కోంది. చాలా తేలికగా ఉండటం, ప్రత్యేకమైన రోటర్‌లను కలిగి ఉండటం వలన, ఎల్‌సీహెచ్ అటువంటి ఎత్తైన శిఖరాలపై కూడా తన మిషన్‌ను నిర్వహించగలదు.
ఎల్‌ఏసీ అంటే.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రకారం, ఎల్‌సీహెచ్ అటువంటి స్టెల్త్ లక్షణాలను కలిగి ఉంది. అది శత్రువు రాడార్లకు చిక్కకుండా సులభంగా దూసుకుపోగలదు. శత్రు హెలికాప్టర్ లేదా ఫైటర్ జెట్ తన క్షిపణిని ఎల్‌సీహెచ్‌లో లాక్ చేసినట్లయితే.. అది కూడా దానిని తప్పించుకోగలదు. దాని బాడీ పకడ్బందీగా ఉంటుంది. తద్వారా దానిపై కాల్పుల ప్రభావం ఉండదు. బుల్లెట్ కూడా రోటర్లపై ఎలాంటి ప్రభావం చూపదు.
ఇది పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఎల్‌సీహెచ్ హెలికాప్టర్ల తయారు చేశారు. దీని ట్రయల్ రన్ సియాచిన్ గ్లేసియర్ నుంచి రాజస్థాన్ ఎడారి వరకు ఎల్‌ఏసీ పై జరిపారు. భారత వైమానిక దళం కోసం పూర్తిగా సిద్ధం కావడానికి కొంత సమయం పట్టింది. ఈ సమయంలో, ఎల్‌సీహెచ్ లో తగినంత మొత్తంలో ఇంధనం, ఆయుధాలు కూడా రెడీ చేసుకుంది. అధికారికంగా వైమానిక దళంలో చేరడానికి ముందే.. రెండు ఎల్‌సీహెచ్ హెలికాప్టర్లు తూర్పు లడఖ్‌కు ఆనుకుని ఉన్న ఎల్‌ఏసీ లో మోహరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం