దుర్మార్గుడు దారుణంగా టార్చర్ చేసి చంపాడు.. వైద్యురాలి హత్యాచారం కేసులో నమ్మలేని భయంకర నిజాలు

|

Aug 14, 2024 | 12:52 PM

పశ్చిమ బెంగాల్‌లో మెడికో హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌ (31) పై అత్యాచారం, హత్యకు గురైంది.. కాగా.. బాధితురాలి పోస్ట్‌మార్టం నివేదికలో నమ్మలేని భయంకర నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఆమె జననాంగంపై గాయాలు చేసి దారుణంగా చంపేసినట్లు పేర్కొంటున్నారు.

దుర్మార్గుడు దారుణంగా టార్చర్ చేసి చంపాడు.. వైద్యురాలి హత్యాచారం కేసులో నమ్మలేని భయంకర నిజాలు
Doctor's Rape Murder Case
Follow us on

పశ్చిమ బెంగాల్‌లో మెడికో హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌ (31) అత్యాచారం, హత్యకు గురైంది.. కాగా.. అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పోస్ట్‌మార్టం నివేదికలో నమ్మలేని భయంకర నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఆమె జననాంగంపై గాయాలు చేసి దారుణంగా చంపేసినట్లు పేర్కొంటున్నారు. ఆమె ప్రైవేట్ భాగాలలో లోతైన గాయం కనిపించిందని.. బాధితురాలిని దారుణంగా ఉక్కిరిబిక్కిరి చేసి చంపేసినట్లు వైద్యులు నిర్ధారించారు. గొంతు నులిమి చంపడంతో.. ఆమె థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిపోయినట్లు గుర్తించారు. ఆగస్టు 9వ తేది (శుక్రవారం) తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య అత్యాచారం, హత్య జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి.

నివేదిక ప్రకారం.. బాధితురాలి ఉదరభాగం, పెదవులు, వేళ్లు, ఎడమ కాలికి గాయాలు ఉన్నాయి. బాధితురాలి నోరు మూసేసి.. కేకలు వేయకుండా నోరు, ముక్కు మూసి.. ఆమె తలను గోడకు లేదా నేలపై అదిమిపట్టినట్లు పేర్కొంటున్నారు. అసహజ లైంగిక చర్య.. పాశవిక దాడి కారణంగా జననాంగం, అంతర్గత అవయవాల వద్ద లోతైన గాయం అయినట్లు పేర్కొంటున్నారు.

దుర్మార్గుడి దాడిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో బాధితురాలి.. ముఖమంతా గోటి గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆమె కళ్లు, నోరు, అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో ప్రస్తావించినట్లు పేర్కొంటున్నారు. అయితే ఆమె కళ్లకు ఎందుకు గాయాలు అయ్యాయో నిర్ధారణ కాలేదు..

ఇదిలా ఉంటే.. అత్యాచారం.. హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి సెమినార్‌ హాల్‌లో గుర్తించారు. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

బాధితురాలు.. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో నైట్ డ్యూటీలో ఉంది.. బాధితురాలు భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి సెమినార్ హాల్‌కు వెళ్లింది. ఆ తర్వాత శవమై కనిపించింది. అత్యంత దారుణమైన స్థితిలో బాధితురాలు కనిపించింది.. విచారణ చేసిన పోలీసులు ఈ నేరానికి పాల్పడిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.. ఇప్పటికే.. ఈ కేసులో పలువురిని పోలీసులు విచారించారు.. కాగా.. ఈ కేసును కొల్ కత్తా హైకోర్టు మంగళవారం సీబీఐకి అప్పగించింది..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..