ఇటీవల కోయంబత్తూర్‌లో ఓ మహిళా డ్రైవర్ తన ఉద్యోగం కోల్పోవడంపై నటుడు,ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ స్పందించారు. ఆ మహిళకు కారును గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు ప్రకటించాడు. వివరాల్లోకి వెళ్తే గతవారం డీఎంకే ఎంపీ కనిమొళి కోవైలో పర్యటించింది. ఇందులో భాగంగా షర్మిల అనే ఓ మహిళా డ్రైవర్ నడుపుతున్న బస్‌లో ఆమె ప్రయాణించింది. షర్మిల బస్సు నడపడాన్ని చూసిన కనిమొళి ఆమెకు ఓ గడియారాన్ని బహుమతిగా ఇచ్చి సత్కరించింది. అయితే ఆ బస్సులో శిక్షణలో ఉన్న మరో మహిళా కండక్టర్ ఎంపీకి టికెట్ ఇవ్వడాన్ని షర్మిల తప్పు బట్టింది. అలాగే ఎంపీ పట్ల ఆ కండక్టర్ అనుచితంగా ప్రవర్తించినట్లు షర్మిల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. అలాగే షర్మిల కూడా తన పాపులారిటీ కోసం బస్సులో చాలాసార్లు సెలబ్రీటలను ఆహ్వానిస్తూ ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేదంటూ ఆ మహిళా డ్రైవర్ షర్మిలపై ఫిర్యాదు చేసింది. దీంతో యాజమాన్యం విధుల నుంచి షర్మిలను తొలగించింది.
అయితే కోయంబత్తూర్‌లో మహిళ బస్సు డ్రైవర్ షర్మిలకు సంబంధించిన వివాదం తనను బాధించిందని కమల్ హాసన్ అన్నారు. షర్మిల కేవలం డ్రైవర్‌గానే మిగిలిపోకూడదని.. ఎంతో మంది షర్మిలలను సృష్టించాలనేది తన విశ్వాసం అని తెలిపారు. దీంతో ఆమెకు కారు అందిస్తున్నామని చెప్పారు. కేవలం క్యా్బ్ సేవలకే కాకుండా చాలామందికి ఉపాధి కల్పించేలా పారిశ్రామిక వేత్తగా ఎదిగేందుకు ఈ కారును వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇన్నిరోజుల దాకా ఉద్యోగిగా ఉన్న షర్మిల ఇప్పటి నుంచి చాలామందికి ఉపాధి కల్పించేలా ఎదగాలని ఆకాంక్షించారు.