Chief Justice of India: తదుపరి సీజేఐ ఆయనే.. కానీ ఆయన ఆ పదవిలో ఎక్కువ రోజులు ఉండలేరు..

|

Oct 25, 2024 | 8:10 AM

తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. ఆయన నియామకానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. CJI చంద్రచూడ్ గతంలో జస్టిస్ ఖన్నా పేరును తుదిపరి ప్రధాన న్యాయమూర్తి పదవికి  సిఫార్సు చేశారు.

Chief Justice of India: తదుపరి సీజేఐ ఆయనే.. కానీ ఆయన ఆ పదవిలో ఎక్కువ రోజులు ఉండలేరు..
New Cji Justice Sanjiv Khan
Follow us on

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో మొదటి ప్యూస్నే న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఖన్నా, ప్రస్తుత CJI, DY చంద్రచూడ్ పదవీ విరమణ తర్వాత నవంబర్ 11న ఆ పదవిని చేపట్టనున్నారు.

CJI చంద్రచూడ్ గతంలో జస్టిస్ ఖన్నా పేరును తుదిపరి ప్రధాన న్యాయమూర్తి పదవికి  సిఫార్సు చేశారు. ప్రస్తుత న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ 65 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసిన ఒక రోజు తర్వాత, నవంబర్ 11న జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 8, 2022న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ ఖన్నా నియామకానికి ప్రభుత్వ ఆమోదాన్ని ధృవీకరిస్తూ, కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ X ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. జస్టిస్ ఖన్నా 183 రోజులు మాత్రమే సీజేఐ ఉండనున్నారు. అంటే ఆయన కేవలం ఆరు నెలలు మాత్రమే ఈ పదవిలో ఉంటారన్నమాట. అతను మే 13, 2025న పదవీ విరమణ చేయనున్నారు.  మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి హన్స్ రాజ్ ఖన్నా మేనల్లుడు జస్టిస్ సంజీవ్ ఖన్నా ADM జబల్‌పూర్ కేసులో  ఇచ్చిన తీర్పుతో ఆయన ప్రసిద్ధి చెందాడు.

కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ట్వీట్:

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి