జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు రాజకీయాలు ఊపందుకున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇదే కావడం ఉత్కంఠ రేపుతోంది. గతంలో 2014లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం జమ్మూ, కాశ్మీర్ పూర్తి రాష్ట్ర హోదా పొందిన తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ఆసక్తి రేపుతోంది.
2024 జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ అత్యంత ఉత్కంఠగా సాగనుంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 7 జిల్లాల్లోని 24 అసెంబ్లీ స్థానాలకు రేపు సెప్టెంబర్ 18న పోలింగ్ జరగనుంది. ఇందులో 23.27 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
మొదటి దశలో ఉన్న 24 సీట్లలో 8 సీట్లు జమ్మూ డివిజన్‌లో, 16 సీట్లు కాశ్మీర్ వ్యాలీలో ఉన్నాయి. గరిష్టంగా 7 సీట్లు అనంత్‌నాగ్ జిల్లాలో, పుల్వామాలో 4, కుల్గామ్‌లో 3, కిష్త్వార్, దోడా, షోపియాన్, రాంబన్ జిల్లాల్లో రెండేసి నియోజకవర్గాల్లో పోలింగ్‌కు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దోడా, రాంబన్, కిష్త్వార్ జిల్లాలు జమ్మూ డివిజన్‌లో ఉండగా, అనంతనాగ్, పుల్వామా, కుల్గాం, షోపియాన్ కాశ్మీర్ డివిజన్‌లో ఉన్నాయి.
తొలి దశలో 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 9 మంది మహిళలు, 92 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. పుల్వామాలోని పాంపోర్ సీటులో అత్యధికంగా 14 మంది అభ్యర్థులు ఉన్నారు. అదే సమయంలో అనంత్‌నాగ్‌లోని బిజ్‌బెహరా స్థానంలో కేవలం ముగ్గురు అభ్యర్థుల మధ్య ఎన్నికల పోరు నెలకొంది. మొత్తం 110 మంది అభ్యర్థులు లక్షాధికారులు కాగా, 36 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) 21 మంది అభ్యర్థులలో 18 మంది కోటీశ్వరులు ఉన్నారు.
ముఫ్తీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బిజ్‌బెహరా స్థానం కూడా ఈ దశలోనే పోలింగ్ జరగనుంది. ఇక్కడ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మెహబూబా, ఆమె తండ్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ సీఎంలుగా బాధ్యతలు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ మూడు దశల్లో సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.
వాస్తవానికి పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2014 ఎన్నికల్లో పీడీపీ అత్యధికంగా 28 సీట్లు, బీజేపీ 25 సీట్లు గెలుచుకున్నాయి. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..