హెలికాఫ్టర్ ద్వారా రక్షించిన వైమానిక దళం.. వీడియో

మధ్యప్రదేశ్ రాష్ట్రం భారీ వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండు రోజులుగా సహాయ, పునరావాస కార్యక్రమాలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహాయక చర్యల్లో..

హెలికాఫ్టర్ ద్వారా రక్షించిన వైమానిక దళం.. వీడియో
Follow us

|

Updated on: Aug 30, 2020 | 5:17 PM

మధ్యప్రదేశ్ రాష్ట్రం భారీ వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండు రోజులుగా సహాయ, పునరావాస కార్యక్రమాలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహాయక చర్యల్లో కీలక పాత్ర పోషిస్తోంది. పొంగిపొర్లుతున్న వైంగాంగా నది ఒడ్డున ఉన్న బాలాఘాట్‌లోని మోవాడ్ గ్రామానికి సమీపంలో ఉన్న ఇంట్లో చిక్కుకుపోయిన వాళ్లని తాజాగా ఎయిర్ ఫోర్స్ సిబ్బంది హెలి కాఫ్టర్ సాయంతో రక్షించారు. ఇద్దరు యువకులను, ఒక వృద్ధుడిని వారి ఇళ్లపై నుంచి తాడు సాయంతో హెలికాఫ్టర్ లోకి తీసుకొని పునరావాస శిబిరాలకు చేర్చారు. ఇందుకోసం భారత వైమానిక దళం MI 17 V 5 హెలికాప్టర్ మిషన్‌ను ప్రారంభించింది.

అటు, రాష్ట్రంలోని అనేక వరద ప్రభావిత జిల్లాలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం వరద పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సెహోర్ జిల్లా నరేలా గ్రామంలో వరదలో చిక్కుక్కున్న ఐదుగురిని తెల్లవారుజామున 3 గంటలకు రక్షించిన సిబ్బందిని సీఎం అభినందించారు. కాగా, రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 394కి పైగా గ్రామాలు వరదలకు ప్రభావితమయ్యాయి. ఇప్పటివరకు 8 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.