Corona Cases India: దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 14,199 పాజిటివ్ కేసులు, 83 మరణాలు..

Corona Cases India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,199 మందికి కరోనా...

Corona Cases India: దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 14,199 పాజిటివ్ కేసులు, 83 మరణాలు..
Corona-Virus-India

Updated on: Feb 23, 2021 | 10:15 AM

Corona Cases India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,199 మందికి కరోనా పాజిటివ్‌‌గా నిర్దారణ అయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనితో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,10,05,850కి చేరింది. నిన్న కొత్తగా 4,421 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక, ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 1,06,99,410 కోలుకున్నారు.

కాగా, బుధవారం ఒక్కరోజే 83 మంది కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,56,385కు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,50,055 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కాగా, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో మరోసారి కరోనా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?

ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్.. వివరాలివే.!

రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!

Loading...
Unable to load recommendations.
Follow Us