India Corona: కరోనా నుంచి భారీ ఊరట.. 9వేల్లోపే కొత్త కేసులు.. నిన్న ఎంతమంది చనిపోయారంటే?

|

Aug 16, 2022 | 11:18 AM

Covid19 Updates: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా 15 వేలకు పైగానే నమోదువుతున్న కొత్త కేసులు నిన్న ఒక్కసారిగా దిగొచ్చాయి. చాలా రోజుల తర్వాత పదివేల్లోపే రోజువారీ కేసులు నమోదయ్యాయి.

India Corona: కరోనా నుంచి భారీ ఊరట.. 9వేల్లోపే కొత్త కేసులు.. నిన్న ఎంతమంది చనిపోయారంటే?
Coronavirus Cases
Follow us on

Covid19 Updates: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా 15 వేలకు పైగానే నమోదువుతున్న కొత్త కేసులు నిన్న ఒక్కసారిగా దిగొచ్చాయి. చాలా రోజుల తర్వాత పదివేల్లోపే రోజువారీ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం వెల్లడించిన కరోనా బులెటిన్‌ ప్రకారం.. సోమవారం 2.12 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,813 మందికి వైరస్ సోకినట్లు తేలింది. పాజిటివిటీ రేటు 4.15 శాతంగా నమోదైంది. కొత్త కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42,55678 కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 1.11 లక్షల మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఇక గత 24 గంటల్లో 29 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,27,098 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కాగా గత 24 గంటల వ్యవధిలో 15,040 మంది కరోనాతో కోలుకున్నారు. రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. ఇక కరోనా తగ్గుతున్నా వ్యాక్సిన్‌ పంపిణీ మాత్రం చురుగ్గా కొనసాగుతోంది. నిన్న దేశవ్యాప్తంగా 6,10,863 మందికి కరోనా వ్యాక్సిన్‌లు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 208.31 కోట్లు దాటింది. అటు ప్రపంచ దేశాల్లో మాత్రం కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 5,01,547 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,224 మంది చనిపోయారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..