Viral Video:పిల్లల్ని భుజాలపై కూర్చోబెట్టి నది దాటుతున్న తల్లిదండ్రులు.. స్కూల్‌లో దించేందుకు పడరాని పాట్లు.. వంతెన నిర్మించాలంటూ విజ్ఞప్తి..

|

Aug 05, 2022 | 4:22 PM

రవాణా సదుపాయాలు లేక అనేక ఇబ్బందులను దాటుకుంటూ భవిష్యత్ కోసం కలలు కంటూ కొండకోనలు దాటుతూ.. నదులను ఈదుకుంటూ వెళ్తూ చదువుకుంటున్నారు. తాజాగా అలంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video:పిల్లల్ని భుజాలపై కూర్చోబెట్టి నది దాటుతున్న తల్లిదండ్రులు.. స్కూల్‌లో దించేందుకు పడరాని పాట్లు.. వంతెన నిర్మించాలంటూ విజ్ఞప్తి..
Viral Video Maharashtra
Follow us on

Viral Video: భారత దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తోంది. బులెట్ ట్రైన్స్, హైవేలు, రవాణా కోసం సొరంగాలు, ఎక్స్‌ప్రెస్‌వేలు దేశంలోని  నగరాలను అనుసంధానించడానికి, రాష్ట్రాల మధ్య రాకపోకలను సులభతరం చేయడానికి నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాలోని  పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి పోరాటం చేయాల్సిందే. రవాణా సదుపాయాలు లేక అనేక ఇబ్బందులను దాటుకుంటూ భవిష్యత్ కోసం కలలు కంటూ కొండకోనలు దాటుతూ.. నదులను ఈదుకుంటూ వెళ్తూ చదువుకుంటున్నారు. తాజాగా అలంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు లేదా వంతెనలు లేకపోవడంతో కొంతమంది స్టూడెంట్స్ నదిని ఈదుకుంటూ.. అవతలి ఒడ్డుకు వెళ్లి.. చదువుకుంటున్నారు. వైరల్ అవుతున్న వీడియో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకు చెందినదిగా తెలుస్తోంది. ప్రముఖ వార్తా సంస్థ ANI షేర్ చేసిన ఈ వీడియోలో..    కొంతమంది పిల్లలు ఉన్నారు. వారు స్కూల్ యూనిఫారం ధరించి..స్కూల్ బాగ్స్ తో ఉన్నారు. దీంతో వీరంతా స్టూడెంట్స్ అని తెలుస్తోంది. వీరు నాసిక్‌లోని పేత్ తాలూకాలోని లోతైన సుకీ నదిని తల్లిదండ్రుల భుజం మీద ఎక్కి దాటుతున్నారు.

 విద్యార్థుల కష్టంపై ఓ లుక్ వేయండి..:

ఇవి కూడా చదవండి

నది దాటేందుకు వంతెన లేకపోవడంతో చిన్నారులు పాఠశాలలకు వెళ్లాలంటే ఇదే దారి అని స్థానికులు వాపోతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు ప్రతిరోజూ తమ పిల్లలను భుజాలపై కూర్చోబెట్టుకుని నది దాటిస్తారు. అయితే మరికొందరు తల్లిదండ్రులు నది దాటేటప్పుడు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయనే భయంతో పాఠశాలకు పంపడం లేదు.

“నది లోతుగా ఉంది. అయితే పిల్లలు పాఠశాలకు వెళ్లాలి.. కనుక తాము తమ పిల్లల్ని భుజాలపై కూర్చోబెట్టుకుని లేదా పెద్ద పాత్రలలో కూర్చోబెట్టి తీసుకుని వెళ్తామని తల్లిదండ్రులు చెప్పారు. తాము నది దాటడం కోసం వంతెనను నిర్మించాలని  ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా వర్షాకాలంలో బ్యాక్‌వాటర్‌ను నదిలోకి వదలడంతో సమస్య మరింత తీవ్ర తరమవుతుందని తెలిపారు. నదికి వరద వస్తే..  నెలల తరబడి పిల్లలు బడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడి..  చదువులు దెబ్బతింటున్నాయని స్తానికులు వాపోతున్నారు.

ప్రతి ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజాప్రతినిధులు తమ వద్దకు వస్తుంటారని.. కానీ తమ కష్టాన్ని పట్టించుకునేవారు లేరని వాపోతున్నారు. తమకు వాగుపై వంతెన కావాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి జిల్లా పరిషత్‌ల వరకు, పంచాయతీ సమితి సభ్యుల నుంచి స్థానిక ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరిని తాము బ్రిడ్జి నిర్మించాలని ఏళ్ల తరబడి వేడుకుంటున్నామని చెప్పారు. తమ గోడును  ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమ గ్రామంలో రోడ్లు లేవు, వంతెనలు లేవు.. దీని వల్ల పిల్లలు పాఠశాలకు వెళ్లడం చాలా కష్టమవుతుంది, ”అని మరొక స్థానికుడు ANI కి తెలిపారు. ప్రజాప్రతినిధులు ఎన్నికల పర్యటనలు ముగీసిన అనంతరం గ్రామ సమస్యలను  మరిచిపోతున్నారని అంటున్నారు గ్రామస్థులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..