Rajasthan: ‘నా గెదె చావుకు హెలికాప్టర్ శబ్ధమే కారణం’.. ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతు..

|

Nov 16, 2022 | 10:00 AM

తనకు అన్యాయం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం సహజమే. ఇక్కడ కూడా ఓ రైతు తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాడు.

Rajasthan: ‘నా గెదె చావుకు హెలికాప్టర్ శబ్ధమే కారణం’.. ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతు..
Buffalo Died
Follow us on

తనకు అన్యాయం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం సహజమే. ఇక్కడ కూడా ఓ రైతు తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాడు. ఓ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. తన గేదె చనిపోయిందని, అందుకు ఎమ్మెల్యే ప్రయాణించిన హెలికాప్టరే కారణం అని చెప్పుకొచ్చాడు. ఆ హెలికాప్టర్ శద్ధం వల్ల గేదెకు గుండెపోటు వచ్చిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు సదరు రైతు.

రాజస్థాన్‌లోని అల్వార్‌లో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అల్వార్‌లో రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి సహా మంత్రులు హాజరయ్యారు. అయితే, ముఖ్యమంత్రిపై పూలవర్షం కురిపించాలనే ఉద్దేశ్యంతో.. ఎమ్మెల్యే బల్జీత్ యాదవ్ ఓ ప్రైవేట్ హెలికాప్టర్‌ను ఏర్పాటు చేశారు. ఆ హెలికాప్టర్ ద్వారా ప్రభుత్వ పెద్దలపై పూల వర్షం కురిపించారు. ఆ కార్యక్రమం అలా సాఫీగా సాగిపోయింది.

ఇవి కూడా చదవండి

అదలాఉంటే.. అభివృద్ధి కార్యక్రమాలు ఓ రైతు కంట కన్నీరుని మిగిల్చాయి. తాను సాదుతున్న ఓ గెది ఉన్నట్లుండి ప్రాణాలు కోల్పోయింది. దానికి కారణం ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన హెలికాప్టరే అని అంటాడు బాధిత రైతు. హెలికాప్టర్ శబ్ధం కారణంగా గేదెకు గుండెపోటు వచ్చిందని, అలా అది ప్రాణాలు కోల్పోయిందని రైతు వాపోయాడు. ఇదే విషయమై పోలీసులను ఆశ్రయించాడు బాధిత రైతు. హెలికాప్టర్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాడు. చనిపోయిన గేదె విలువ రూ. 1.5 లక్షలు అని, తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరాడు. బాధిత రైతు ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రైతు రాసిచ్చిన ఫిర్యాదు లేఖను కింది పోస్ట్‌లో చూడొచ్చు..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..