Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్

మూడు నెలల క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య కోసం భర్త అలుపెరగకుండా వెతికాడు. చివరకు రోడ్డుపక్కన దయనీయ స్థితిలో ఉన్న ఆమెను గుర్తించి, కన్నీరుమున్నీరుగా విలపించాడు. భార్యను గుండెలకు హత్తుకుని అతడు పడిన రోదన అక్కడున్న వారిని సైతం కంటతడి పెట్టించింది. ఈ హృదయవిదారక దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్
Husband Found Missing Wife On Roadside

Updated on: Oct 04, 2026 | 11:47 AM

బంగ్లాదేశ్‌, అక్టోబర్ 4: బంగ్లాదేశ్‌లో జరిగిన ఓ హృదయ విదారక ఘటన ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మతిస్థిమితం కోల్పోయిన తన భార్య మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోవడంతో.. ఆమె కోసం భర్త అలుపెరగకుండా వెతికాడు. చివరకు రోడ్డుపక్కన దయనీయ స్థితిలో ఉన్న ఆమెను గుర్తించాడు. ఎన్నాళ్లుగా కనిపించని భార్యను ఆ పరిస్థితిలో చూసిన అతడు.. ఆమెను గట్టిగా హత్తుకుని కన్నీరుమున్నీరుగా విలపించిన దృశ్యం అక్కడున్న వారిని కదిలించింది.

మూడు నెలలుగా వెతుకుతూనే..

బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి భార్య కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఒకరోజు ఆమె ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. భార్య కనిపించకపోవడంతో భర్త తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఆమె ఎక్కడికి వెళ్లింది? ఎలా ఉంది? తిండి తింటుందా? ఎలాంటి పరిస్థితుల్లో ఉందో? అంటూ నిరంతరం ఆలోచిస్తూ ఆమె కోసం వెతకడం ప్రారంభించాడు. భార్యను ఎలాగైనా తిరిగి ఇంటికి తీసుకురావాలనే ఉద్దేశంతో అతడు వివిధ ప్రాంతాల్లో వెతికాడు. తెలిసినవారిని అడిగాడు. ఎక్కడైనా ఆమెకు సంబంధించిన చిన్న సమాచారం లభించినా వెంటనే అక్కడికి వెళ్లేవాడు. రోజులు గడిచాయి. వారాలు దాటిపోయాయి. చివరకు మూడు నెలలు గడిచినా అతడు వెతకడం మాత్రం ఆపలేదు.

ఇవి కూడా చదవండి

రోడ్డుపక్కన కనిపించిన భార్య.. ప్రేమకు అసలు అర్థం ఇదేనా?

అలా వెతుకుతున్న సమయంలో ఒకరోజు రోడ్డుపక్కన నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ మహిళ అతడి కంటపడింది. చిరిగిన దుస్తులు, చిందరవందరగా ఉన్న జుట్టుతో ఉన్న ఆమెను చూసిన వెంటనే తన భార్యేనని గుర్తించాడు. ఆమెను ఆ పరిస్థితిలో చూసిన అతడు ఒక్కసారిగా చలించిపోయాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె దగ్గరకు పరుగెత్తుకెళ్లాడు. తన భార్యను గట్టిగా హత్తుకుని భర్త బోరున విలపించాడు. మూడు నెలలుగా ఆమె కోసం తాను పడిన ఆవేదన ఒక్కసారిగా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చింది. ‘ఎన్నాళ్లు నిన్ను వెతికాను’ అంటూ అతడు కన్నీళ్లు పెట్టుకున్న తీరు అక్కడున్న వారిని కూడా కదిలచి వేసింది. భార్య ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆమెను వదిలిపెట్టకుండా వెతుకుతూ ఉండటం అతడి అనుబంధాన్ని చూపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలువురు స్పందిస్తున్నారు. చిన్న చిన్న మనస్పర్థలకే బంధాలను తెంచుకునే పరిస్థితులు పెరుగుతున్న ఈ రోజుల్లో.. కష్టాల్లో ఉన్న జీవిత భాగస్వామిని వదిలిపెట్టకుండా వెతుకుతూ వెళ్లిన ఈ భర్త కథ ఆలోచింపజేస్తోందని అంటున్నారు. పెళ్లి సమయంలో ‘కష్టాల్లోనూ, సుఖాల్లోనూ తోడుగా ఉంటాం’ అని చేసే ప్రమాణాలకు ఈ ఘటన అర్థం చెబుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రతి వివాహం, ప్రతి సంబంధం వెనుక పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అందువల్ల ఈ ఘటనను అన్ని సంబంధాలకు ఒకే కొలమానంగా చూడటం కంటే.. కష్టాల్లో ఉన్న వ్యక్తిని వదిలిపెట్టకుండా అండగా నిలబడటం, మానవత్వంతో వ్యవహరించడం ఎంత ముఖ్యమో గుర్తుచేసే ఉదాహరణగా చూడటం సముచితం. మూడు నెలల అన్వేషణ తర్వాత తన భార్యను తిరిగి చూసిన ఆ భర్త కళ్లలో కనిపించిన ఆనందం, బాధ, ఉపశమనం.. ఈ ఘటనను మరింత హృదయవిదారకంగా మార్చాయి. నిజమైన అనుబంధం కేవలం సంతోషాల్లో కలిసి ఉండటం మాత్రమే కాదని.. కష్టాల్లోనూ ఒకరి చేయి మరొకరు వదలకపోవడమే బంధానికి అసలు బలం అని ఈ కథ మరోసారి గుర్తుచేస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us