పాక్ కి రహస్య సమాచారం చేరవేత, హెచ్ఎఎల్ ఉద్యోగి అరెస్ట్

మహారాష్ట్రలో హెచ్ఏఎల్ ఉద్యోగి దీపక్ శ్రీశాత్ ను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సిబ్బంది అరెస్టు చేశారు. నాసిక్ లోని ఈ సంస్థలో పని చేసే ఇతగాడు ఫైటర్ విమానాలకు సంబంధించిన సమాచారాన్ని రహస్యంగా పాకిస్తాన్ గూఢఛార సంస్థ ఐ ఎస్ ఐ కి పంపేవాడట. వాట్సాప్ ఇతర సోషల్ మీడియా ద్వారా..ఈ ‘ఇంటిదొంగ’ రహస్యంగా ఉంచాల్సిన  అంశాలను ఎంచక్కా పాక్ ఐ ఎస్ ఐకి పంపుతూ వచ్చా డని పోలీసులు తెలిపారు. నాసిక్ సమీపంలోని ఓజార్ లో […]

పాక్ కి రహస్య సమాచారం చేరవేత, హెచ్ఎఎల్ ఉద్యోగి అరెస్ట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 09, 2020 | 5:07 PM

మహారాష్ట్రలో హెచ్ఏఎల్ ఉద్యోగి దీపక్ శ్రీశాత్ ను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సిబ్బంది అరెస్టు చేశారు. నాసిక్ లోని ఈ సంస్థలో పని చేసే ఇతగాడు ఫైటర్ విమానాలకు సంబంధించిన సమాచారాన్ని రహస్యంగా పాకిస్తాన్ గూఢఛార సంస్థ ఐ ఎస్ ఐ కి పంపేవాడట. వాట్సాప్ ఇతర సోషల్ మీడియా ద్వారా..ఈ ‘ఇంటిదొంగ’ రహస్యంగా ఉంచాల్సిన  అంశాలను ఎంచక్కా పాక్ ఐ ఎస్ ఐకి పంపుతూ వచ్చా డని పోలీసులు తెలిపారు. నాసిక్ సమీపంలోని ఓజార్ లో గల  హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ లో ఎన్ని ఫైటర్ విమానాలు ఉత్పత్తి అవుతున్నాయి, ఆ కార్యాలయంలో నిషిధ్ధ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి..తదితర సమాచారమంతా పూస గుచ్చినట్టు పాకి సంస్థకు ఇతనిద్వారా తెలిసిపోయేది. 41 ఏళ్ళ ఈ ఉద్యోగి అసిస్టెంట్ సూపర్ వైజర్ అని తెలిసింది. ఇతని నుంచి మూడు మొబైల్ ఫోన్లు, అయిదు సిమ్ కార్డులు, రెండు మెమొరీ కార్డులను స్వాధీనం  చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు.  దర్యాప్తు జరుగుతోంది.