అక్రమ సంపాదన కోసం తాగే పానీయాలు, తినే ఆహార పదార్థాలను సైతం వదలడం లేదు కేటుగాళ్లు. ప్రతి దానిని కల్తీ చేస్తున్న ఘటనలు మనకు తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఒక ఫ్రూట్ జ్యూస్‌ను కల్తీ చేస్తూ ఓ దుర్మార్గుడు పట్టుబడ్డాడు. అది కూడా ఆ పళ్ళ రసాల్లో మనుషుల మూత్రం పోసి అమ్ముతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ కావడంతో అధికారులు దాడి చేసి జ్యూస్ సెంటర్ నిర్వాహకుడికి అదుపులోకి తీసుకున్నారు.
ఘజియాబాద్ జిల్లాలోని బోర్డర్ ప్రాంతంలో ఓ మైనర్ (15)తోపాటు 29 ఏళ్ల జ్యూస్ విక్రేతను పోలీసులు అరెస్ట్ చేశారు. పండ్ల రసంలో మానవ మూత్రం కలిపినందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్రూట్ జ్యూస్‌లో మూత్రం కలుపుతున్నట్లు శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు అంకుర్ విహార్ ఏరియా అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ భాస్కర్ వర్మ తెలిపారు. జ్యూస్ విక్రయిస్తున్న వ్యక్తిని అమీర్ (29)గా గుర్తించినట్లు తెలిపారు.
उक्त प्रकरण के सम्बन्ध में श्री भाष्कर वर्मा, सहायक पुलिस आयुक्त अंकुर विहार की वीडियो बाइट- pic.twitter.com/nH7NIJz2cM
— POLICE COMMISSIONERATE GHAZIABAD (@ghaziabadpolice) September 13, 2024
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జ్యూస్ స్టాల్‌లో సోదా చేయగా మూత్రంతో నిండిన ప్లాస్టిక్ డబ్బా కనిపించిందని వర్మ తెలిపారు. ఈ విషయమై పోలీసులు అమీర్‌ను విచారించినా సమాధానం చెప్పలేకపోయాడని ఆయన తెలిపారు. పోలీసులు అతనిని అరెస్టు చేసి అతని సహచరుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ విషయంలో న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
ఘాజియాబాద్ శివారులో అమీర్ ఖాన్ అనే వ్యక్తి ఖుషీ జ్యూస్ కార్నర్ పేరుతో ఫ్రూట్ జ్యూస్ విక్రయాలు చేస్తున్నాడు. అక్కడ తయారు చేసే జ్యూస్‌లో మనుషుల మూత్రం కలిపి.. కస్టమర్లకు అమ్ముతున్నాడు. అయితే ఆ జ్యూస్ తాగిన కొందరు కస్టమర్లకు అందులో ఏదో కలిపినట్లు అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడ తనిఖీలు చేయగా.. మూత్రం డబ్బా కనిపించింది. దీంతో జ్యూస్ సెంటర్ నిర్వహకులను చితకబాది ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..