Bipin Rawat: 6 ఏళ్లనాటి ఘటనలో మృత్యువును జయించి.. తాజా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బిపిన్‌ రావత్‌

|

Dec 08, 2021 | 11:29 PM

Bipin Rawat: భారత త్రివిధ దళాల అధిపతి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్‌ రావత్‌ తన కుటుంబంతో క‌లిసి ప్రయణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ Mi-17V-5 తమిళ‌నాడులోని నీలగిరి..

Bipin Rawat: 6 ఏళ్లనాటి ఘటనలో మృత్యువును జయించి.. తాజా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బిపిన్‌ రావత్‌
Follow us on

Bipin Rawat: భారత త్రివిధ దళాల అధిపతి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్‌ రావత్‌ తన కుటుంబంతో క‌లిసి ప్రయణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ Mi-17V-5 తమిళ‌నాడులోని నీలగిరి కొండ‌ల్లో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో బిపిన్‌ రావత్‌తో పాటు ఆయన భార్య, మొత్తం 13 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 2015లో ఇలాంటి హెలికాప్టర్‌ ప్రమాదమే జరిగింది. అందులో బిపిన్‌ రావత్‌ ప్రాణాలతో బయటపడ్డారు. బిపిన్‌ రావత్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌గా ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పుడు మృత్యువును జయించి.. తాజా ప్రమాదంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆరేళ్ల కిందట లెఫ్టినెంట్‌ జనరల్‌గా ఉన్న రావత్‌.. 2015 ఫిబ్రవరి 3న నాగలాండ్‌ దిమాపూర్‌ జిల్లాలోని హెలిప్యాడ్‌ నుంచి బయలుదేరారు. చీతా హెలికాప్టర్‌లో ఆయనతో పాటు మరో ఇద్దరు సిబ్బంది కూడా ఉన్నారు. హెలికాప్టర్‌ టేకాప్‌ అయిన కొన్ని సెకండ్లకే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో రావత్‌ బతికి బయటపడ్డారు. బిపిన్‌ రావత్‌తో పాటు సిబ్బంది స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. అదే తరహా తాజాగా జరిగిన ప్రమాదంలో బిపిన్‌ రావత్‌తో పాటు ఆయన భార్య ప్రాణాలు కోల్పోవడం యావత్‌ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

బిపిన్‌ రావత్‌ను భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా కేంద్రం నియమించింది. ఆర్మీ చీఫ్‌గా రిటైర్‌ అయిన తరవాత ఆయన ఈ పదవిని చేపట్టారు. త్రివిధ దళాలకు అధిపతిగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందన్న విషయంపై ఆర్మీ దర్యాప్తును ప్రారంభించింది. సైన్యాధిపతి హోదాలో రావత్‌ అనేక సంస్కరణలు చేపట్టారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కఠిన విధానాన్ని తెచ్చారు. సిమ్లాలోని సెయింట్‌ ఎడ్వర్డ్‌ పాఠశాలలో చదివిన రావత్‌ ప్రతిష్ఠాత్మక నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ ద్వారా సైన్యంలోకి ఎంపికయ్యారు. శిక్షణ తర్వాత 1978 డిసెంబర్‌లో గూర్ఖా రైఫిల్స్‌ రెజిమెంట్‌లో అధికారిగా చేరారు. అనేక ప్రాంతాల్లో, వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు.

ఇవి కూడా చదవండి:

New CDS: భారత సాయుధ త్రివిధ దళాల కొత్త అధిపతి ఎవరు? అప్పుడే మొదలైన చర్చ!

CDS Bipin Rawat: భారతీ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మృతి పట్ల యావత్ దేశం దిగ్భ్రాంతి.. స్మరించుకున్న ప్రముఖులు

CDS Bipin Rawat : పాక్ పై సర్జికల్‌ స్ట్రైక్స్‌.. మయన్మార్‌ మిలిటరీ ఆపరేషన్‌.. అందుకే ఆయనంటే ప్రధానికి అంత నమ్మకం..