National: ఆ తోడేలును పట్టుకోవడం కోసం వినూత్న ప్రయత్నం.. రంగంలోకి ఆడ తోడేలు

|

Sep 19, 2024 | 8:29 AM

ఇందులో భాగంగా తోడేళ్లను పట్టుకోవడానికి అధికారులు 'ఆపరేషన్‌ భేడియా'ను చేపట్టారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు అధికారులు మొత్తం 5 తోడేళ్లను బంధించారు. అయితే ఒక్క తోడేలు మాత్రం దొరకడం లేదు. అధికారులు విశ్వ ప్రయత్నం చేసినా ఆ తోడేళు మాత్రం చిక్కడం లేదు. దీంతో చిక్కకుండా తప్పించుకుపోతున్న తోడేలును పట్టుకునేందుకు...

National: ఆ తోడేలును పట్టుకోవడం కోసం వినూత్న ప్రయత్నం.. రంగంలోకి ఆడ తోడేలు
Operation Bhediya
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్‌ జిల్లాల్లో తోడేళ్ల దాడులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా తోడేళ్లు మనుషులపై దాడులు చేస్తూ నానా హంగామా సృష్టిస్తున్నాయి. మహసి ప్రాంతంతో ఇప్పటికే ఈ తోడేళ్ల బారిన పడి పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. మొత్తం ఆరు తోడేళ్లు గుంపుగా సంచరిస్తూ మనుషులపై దాడులు చేస్తున్నల్లు అధికారులు గుర్తించారు.

ఇందులో భాగంగా తోడేళ్లను పట్టుకోవడానికి అధికారులు ‘ఆపరేషన్‌ భేడియా’ను చేపట్టారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు అధికారులు మొత్తం 5 తోడేళ్లను బంధించారు. అయితే ఒక్క తోడేలు మాత్రం దొరకడం లేదు. అధికారులు విశ్వ ప్రయత్నం చేసినా ఆ తోడేళు మాత్రం చిక్కడం లేదు. దీంతో చిక్కకుండా తప్పించుకుపోతున్న తోడేలును పట్టుకునేందుకు అధికారులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు.

ఆ ఆరో తోడేలును పట్టుకోవడం కోసం ఆడ తోడేలు గొంతును ఉపయోగించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆడ తోడేలు ఊళ (అరుపును)ను రికార్డ్ చేశారు. ఈ రికార్డ్‌ను పలు ప్రాంతాల్లో వినిపిస్తున్నారు. చిక్కకుండా తప్పించుకుంటున్న ఆ తోడేలు మగ తోడేలుగా భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ ఊళ విని తోడేళుల విని వస్తుందని, దాంతో దానిని బంధించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే తోడేళ్లను పట్టుకోవడానికి ఇటీవల అధికారులు మరో ప్రయత్నం కూడా చేశారు. టెడ్డీ బొమ్మలను చిన్నారుల మూత్రంతో తడిపి వాటిని తోడేళ్లు సంచరిస్తున్నట్లు భావిస్తున్న చోట్ల వేశారు. అవి మనిషి వాసనలా భ్రమపడి రాగానే వాటిని బోనులో బంధించారు. ఇలా చేసిన తర్వాత 5వ తోడేలు బోనుకు చిక్కింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..