పాక్ భారీ కుట్ర.. కచ్ తీరంలో షిపింగ్‌ బొటులో…

| Edited By:

Jan 07, 2020 | 5:36 AM

పాకిస్థాన్ రూట్ మార్చింది. దేశంలో అలజడి సృష్టించేందుకు నిత్యం కన్నింగ్ ప్లాన్లు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే బార్డర్లో మన సైన్యం పాక్ కవ్వింపు చర్యలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా భారత్‌లో అక్రమంగా దందాకు తెరలేపింది. నిషేధిత మాదకద్రవ్యాలను తీరం వెంట దేశంలోకి చొప్పించేందుకు ప్రయత్నించింది. గుజరాత్‌లోని కచ్ తీరం గుండా దేశంలోకి చొరబడేందుకు అయిదుగురు పాకిస్థానీయులు ప్రయత్నించారు. ఓ బోటులో వీరు తీరం గుండా రావడాన్ని గమనించిన కోస్టల్ గార్డ్స్, […]

పాక్ భారీ కుట్ర.. కచ్ తీరంలో షిపింగ్‌ బొటులో...
Follow us on

పాకిస్థాన్ రూట్ మార్చింది. దేశంలో అలజడి సృష్టించేందుకు నిత్యం కన్నింగ్ ప్లాన్లు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే బార్డర్లో మన సైన్యం పాక్ కవ్వింపు చర్యలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా భారత్‌లో అక్రమంగా దందాకు తెరలేపింది. నిషేధిత మాదకద్రవ్యాలను తీరం వెంట దేశంలోకి చొప్పించేందుకు ప్రయత్నించింది. గుజరాత్‌లోని కచ్ తీరం గుండా దేశంలోకి చొరబడేందుకు అయిదుగురు పాకిస్థానీయులు ప్రయత్నించారు. ఓ బోటులో వీరు తీరం గుండా రావడాన్ని గమనించిన కోస్టల్ గార్డ్స్, ఏటీఎస్ వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఏకంగా రూ. 175 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాక్‌ నుంచి భారత్‌కు పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను స్మగ్లింగ్‌ చేస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన కోస్ట్‌గార్డ్‌ , గుజరాత్‌ ఏటీఎస్‌ జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టింది. డ్రగ్స్‌ తరలిస్తునట్టు బోటును.. కోస్ట్‌గార్డ్‌తో పాటు ఏటీఎస్‌ బలగాలు చుట్టుముట్టాయి. బోటులో ఉన్న అయిదుగురు పాకిస్తానీయులను అదుపులోకి తీసుకున్నారు.