Viral: ఇవి ఏవో చిత్తు కాగితాల బస్తాలు అనుకునేరు.. లోపల ఏముందో తెలిస్తే అవాక్కే

|

Oct 07, 2024 | 7:41 PM

ఢిల్లీలో పెద్ద ఎత్తున కొకైన్ పట్టుబడింది. సౌత్ ఢిల్లీ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా కొకైన్ పట్టుబడటం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. గత మూడు నెలలుగా ఈ కేసుపై తీవ్రంగా దర్యాప్తు చేసిన ఢిల్లీ పోలీసులు.. డ్రగ్స్‌పై ఇది అతి పెద్ద విజయంగా చెబుతున్నారు.

Viral: ఇవి ఏవో చిత్తు కాగితాల బస్తాలు అనుకునేరు.. లోపల ఏముందో తెలిస్తే అవాక్కే
Cocaine
Follow us on

ఢిల్లీ పోలీసులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. మత్త పదార్ధాలు వెనక ఉన్న స్మగ్లర్లు, పెడ్లర్ల బెండు తీస్తున్నారు. తాజాగా పెద్ద ఎత్తున కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ నెల ప్రారంభంలో పోలీసులు 560 కిలోల కొకైన్‌ను సీజ్ చేశారు. పట్టుబడిన కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.5820 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి నలుగురు పెడ్లర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెహ్రౌలీ ఏరియాలో ఈ డ్రగ్స్‌ను సీజ్ చేశారు.  గత వారం రోజుల్లో దాదాపు రూ.7 వేల కోట్ల విలువైన.. రెండు డ్రగ్స్‌ రికవరీలు జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

  • ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ ఈ కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ.5820 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
  • కొకైన్‌ను మహిపాల్‌పూర్‌లోని గోదాంలో దాచి ఉంచి, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు కొద్దికొద్దిగా సప్లై చేస్తున్నారు
  • తొలుత డ్రగ్స్‌ను తీసుకునేందుకు హిమాన్షు, ఔరంగజేబ్ అనే స్మగ్లర్లను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
  • వారి ద్వారా, ఒక పెద్ద అంతర్జాతీయ డ్రగ్స్ కార్టెల్‌తో సంబంధం ఉన్న నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు.
  • ఈ కొకైన్ వివిధ దేశాల మీదుగా భారత్‌కు చేరుకుని ఢిల్లీలోని గిడ్డంగికి చేరింది.
  • కొకైన్‌తో పాటు 40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.20 కోట్లు ఉంటుందని తెలిపారు.
  • ఈ రాకెట్‌లో ప్రధాన నాయకుడు మిడిల్ ఈస్ట్ దేశానికి చెందినవాడని తెలిసింది. పోలీసులు అతడిని విచారిస్తున్నారు.
  • తాజాగా, ఈ బడా డ్రగ్స్ సిండికేట్‌ విచారణ ద్వారా.. పంజాబ్‌లో మరో రూ.10 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
  • ఢిల్లీ పోలీసులు గత మూడు నెలల్లో ఈ డ్రగ్స్ సప్లైపై సమగ్ర విచారణ జరిపారు. అనేక ఇన్‌పుట్‌ల ఆధారంగా యాక్షన్‌లోకి దిగారు.
  • ఈ కేసు భారతదేశంలో అతిపెద్ద డ్రగ్స్ సప్లైయర్స్ గుట్టు బయటపడుతుందని పోలీసులు భావిస్తున్నారు..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..