Crime News: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. 12 ఏళ్ల బాలుడిపై గ్యాంగ్ రేప్.. ఆపై ప్రైవేట్ ప్రైవేట్ పార్ట్‌లో..

|

Sep 26, 2022 | 5:44 AM

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా భద్రత లేకుండా పోతోంది. 12 ఏళ్ల బాలుడిపై ముగ్గురు స్నేహితులు సామూహిక లైంగిక దాడి (Boy Gang-raped) కి పాల్పడటం కలకలం రేపింది.

Crime News: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. 12 ఏళ్ల బాలుడిపై గ్యాంగ్ రేప్.. ఆపై ప్రైవేట్ ప్రైవేట్ పార్ట్‌లో..
Boy Gang Raped In Delhi
Follow us on

Delhi Crime News: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా భద్రత లేకుండా పోతోంది. 12 ఏళ్ల బాలుడిపై ముగ్గురు స్నేహితులు సామూహిక లైంగిక దాడి (Boy Gang-raped) కి పాల్పడటం కలకలం రేపింది. సామూహిక లైంగిక దాడి అనంతరం బాలుడి ప్రైవేట్ పార్ట్ లోకి రాడ్డు చొప్పించి వారు తీవ్రంగా గాయపరిచారు. అనంతరం కర్రలతో దారుణంగా కొట్టారు. కొన ఊపిరితో ఉన్న బాధిత బాలుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని.. చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో సెప్టెంబర్ 18 న జరిగింది. అయితే.. బాలుడిని తల్లిదండ్రులు ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చేర్చగా.. 22న వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరించారు.

నిందితులంతా మైనర్లని పోలీసులు తెలిపారు. బాలుడిపై అతని బంధువు సహా ముగ్గురు మైనర్ స్నేహితులు దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని వారిలో ఒకరిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచామని డీసీసీ చెప్పారు. వెంటనే పోలీసు బృందం ఆసుపత్రికి చేరుకుని, బాలుడి తల్లిదండ్రులను కలుసుకుందని.. కానీ వారు వివరాలు చెప్పేందుకు నిరాకరించారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య జిల్లా) సంజయ్ కుమార్ సైన్ చెప్పారు.

కాగా.. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిల సంగతి పక్కనపెట్టండి.. ఢిల్లీలో కనీసం అబ్బాయిలకు కూడా భద్రత లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 12 ఏళ్ల బాలుడిపై ముగ్గురు దారుణంగా లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపారు. అనంతరం కర్రలతో దారుణంగా కొట్టడంతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఫిర్యాదు అందిందన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..