Navjot Singh Sidhu: మరోసారి పార్టీ మారే ఆలోచనల్లో సిద్దూ.. పంజాబ్‌ కాంగ్రెస్‌లో మొదలైన కొత్త చర్చ..

|

May 08, 2022 | 9:33 PM

నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి పార్టీ మారే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ (Bhagwant Mann)ను ఆ రాష్ట్ర కాంగ్రెస్ విభాగం మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot singh Sidhu) సోమవారం కలుసుకోనున్నారు. ఈ విషయాన్ని..

Navjot Singh Sidhu: మరోసారి పార్టీ మారే ఆలోచనల్లో సిద్దూ.. పంజాబ్‌ కాంగ్రెస్‌లో మొదలైన కొత్త చర్చ..
Navjot Singh Sidhu
Follow us on

పంజాబ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot singh Sidhu) నిరంతరం పార్టీకి వ్యతిరేకంగా వెళ్తున్నారు. దీనిపై పార్టీ నేతల నుంచి కూడా ఆయన వ్యతిరేకత మొదలైంది. తాజాగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి పార్టీ మారే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ (Bhagwant Mann)ను ఆ రాష్ట్ర కాంగ్రెస్ విభాగం మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ సోమవారం కలుసుకోనున్నారు. ఈ విషయాన్ని సిద్ధూ ట్వీట్టర్ వేదికగా ప్రకటించారు. ఆర్థిక సంస్కరణలపై సమావేశం? భగవంత్‌ మాన్‌తో ఈ భేటీ పంజాబ్‌ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడంపైనే అని సిద్ధూ అధికారికంగా చెప్పినప్పటికీ.. చిత్తశుద్ధితో కూడిన సమష్టి కృషితోనే పంజాబ్‌ అభివృద్ధి సాధ్యమని అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రితో సిద్ధూ భేటీ కానున్న రోజే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కూడా జరగనుంది. చింతన్ శివారు ఎజెండాను ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు.

“పంజాబ్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను సోమవారం సాయంత్రం 5.15 గంటలకు కలుసుకుంటున్నాను. నిజాయితీతో కూడిన సమష్టి కృషితోనే పంజాబ్ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం సాధ్యమవుతుంది” అని సిద్ధూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం.. ఆప్ అధికారంలోకి రావడంతో అధిష్ఠానం ఆదేశాలతో సిద్ధూ తన పిపీసీసీ చీఫ్ పదవికి ఇటీవల రాజీనామా చేశారు.

సోనియాకు ఫిర్యాదు అందింది

ఇవి కూడా చదవండి

నవజ్యోత్ సింగ్ సిద్ధూ, పంజాబ్ కాంగ్రెస్ నాయకుల మధ్య మరోసారి అంతా సరిగ్గా పొసగడం లేదు. తాజాగా సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్ర మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పంజాబ్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ హరీష్ చౌదరి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. సిద్ధూ తనను తాను పార్టీ కంటే ఎక్కువగా చూపించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. 

క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో నవజ్యోత్ సింగ్ సిద్ధూ సమాధానం ఇచ్చాడు. సమాధానం ఇచ్చేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నానని అన్నారు. సిద్ధూ తన ట్వీట్‌లో తాను చెప్పిన దాని గురించి ఎటువంటి సూచన చేయనప్పటికీ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చౌదరి రాసిన లేఖకు ఇది ప్రతిస్పందనగా భావిస్తున్నారు.

మరిన్ని రాజకీయ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి: Taj Mahal: తాజ్‌మహల్‌లోని ఆ గదులను తెరవండి.. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్..

Kitchen Tips: టేస్టీ టేస్టీ పాస్తా కట్‌లెట్.. మీ ఇంట్లోని చిన్నారులకు అదిరిపోయే టిఫిన్ ఇలా చేయండి..