బంగళా వివాదం.. ప్రియాంక గాంధీకి నోటీస్ ఇస్తారా ? కాంగ్రెస్ ఫైర్

ఢిల్లీ లోధీ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ ఉంటున్న బంగళాను ఖాళీ చేయాలంటూ కేంద్రం జారీ చేసిన నోటీసుపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. ఇలాంటి నోటీసులకు భయపడబోమని..

బంగళా వివాదం.. ప్రియాంక గాంధీకి నోటీస్ ఇస్తారా ? కాంగ్రెస్ ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 02, 2020 | 1:29 PM

ఢిల్లీ లోధీ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ ఉంటున్న బంగళాను ఖాళీ చేయాలంటూ కేంద్రం జారీ చేసిన నోటీసుపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. ఇలాంటి నోటీసులకు భయపడబోమని, ఈ విఫల మోదీ ప్రభుత్వ తప్పిదాలను హైలైట్ చేస్తూనే ఉంటామని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా మండిపడ్డారు. ఈ విధమైన చర్యలకు ప్రియాంక గానీ మా పార్టీ నాయకత్వం గానీ లొంగే ప్రసక్తే లేదన్నారు. మా పార్టీ పట్ల మోదీకి ఉన్న ద్వేషం, కక్ష సాధింపు ఈ దేశానికంతటికీ తెలిసిందే అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ నిర్వాకం మరీ దిగజారిపోయిందని  సూర్జేవాలా ఆరోపించారు. మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇద్దరూ వ్యక్తం చేస్తున్న ‘యాంగ్జైటీ’ తెలుస్తూనే ఉంది అని ఆయన దుయ్యబట్టారు. మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీకి సెక్యూరిటీని ఎలా తొలగించారో.. అలాగే మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్.డీ, దేవెగౌడలకు కూడా భద్రత ఎలా ఉపసంహరించారో ఈ దేశ ప్రజలు చూస్తున్నారని రణదీప్ సింగ్ సూర్జేవాలా పేర్కొంటూ.. అయినా ఇలాంటి చర్యలకు బెదిరేది లేదన్నారు.