AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coffee Day: ఉన్నపలంగా 20 ఎగిసిపడ్డ కాఫీ డే షేర్లు..

కర్ణాటక రాజకీయ పరిణామాల ప్రభావంతో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ షేర్లు ఒక్కసారిగా 20 శాతం లాభపడి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. సిద్ధరామయ్య రాజీనామా అనంతరం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాల నేపథ్యంలో పెట్టుబడిదారులు భారీగా షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. డీకే శివకుమార్ కుటుంబానికి కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుటుంబంతో ఉన్న బంధం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది.

Coffee Day: ఉన్నపలంగా 20 ఎగిసిపడ్డ కాఫీ డే షేర్లు..
Coffee Day
Sravan Kumar B
| Edited By: |

Updated on: May 29, 2026 | 6:38 PM

Share

కర్ణాటక రాజకీయాల్లో చోటుచేసుకున్న తాజా పరిణామాలు స్టాక్ మార్కెట్‌పై ఊహించని ప్రభావాన్ని చూపించాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా వార్తల నేపథ్యంలో ప్రముఖ కాఫీ చైన్ సంస్థ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ షేర్లు ఏకంగా 20 శాతం వరకు ఎగసిపడి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కొత్త సమీకరణాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాల నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్లు వార్తలు రావడంతో.. తదుపరి ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరు బలంగా వినిపిస్తోంది. ఈ వార్త వ్యాపార వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. దీనికి ప్రధాన కారణం కాఫీ డే వ్యవస్థాపకుడు దివంగత వీజీ సిద్ధార్థ కుటుంబంతో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాలే. వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేకు డీకే శివకుమార్ తన కుమార్తె ఐశ్వర్యను వివాహం చేయడం తెలిసిందే.

ఈ నేపథ్యంతో.. డీకే శివకుమార్ సీఎం అయితే కాఫీ డే సంస్థకు మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని మదుపరులు భావిస్తున్నారు. దీంతో మార్కెట్ ప్రారంభమైన వెంటనే పెట్టుబడిదారులు భారీగా షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా కంపెనీ షేర్లు ఒక్కసారిగా 20 శాతం వరకు లాభపడి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఒక రాజకీయ పరిణామం ప్రభావంతో ఒక కంపెనీ షేర్లు ఇంత వేగంగా పుంజుకోవడం మార్కెట్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. గత కొంతకాలంగా కాఫీ డే సంస్థ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వీజీ సిద్ధార్థ మరణానంతరం సంస్థ కార్యకలాపాలు కొంత మందగించాయి.

అయితే ఇప్పుడు ఆ కుటుంబానికి అత్యంత దగ్గర వ్యక్తిగా భావించే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపించడం కంపెనీకి నైతికంగా, వ్యాపారపరంగా బలం చేకూరుస్తుందని పెట్టుబడిదారులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలు కూడా వ్యాపారాలకు అనుకూలంగా ఉండొచ్చన్న అభిప్రాయం మార్కెట్లో వినిపిస్తోంది. ముఖ్యంగా పర్యాటక, రిటైల్, హాస్పిటాలిటీ రంగాలకు కొత్త ప్రభుత్వం ప్రోత్సాహక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో కాఫీ డే వంటి రిటైల్ బ్రాండ్‌లకు దీర్ఘకాలికంగా ప్రయోజనం కలిగే అవకాశముందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.

రాజకీయాలు, వ్యాపార రంగాల మధ్య ఉన్న అనుబంధానికి ఈ పరిణామం తాజా ఉదాహరణగా మారింది. డీకే శివకుమార్ అధికారికంగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడితే కాఫీ డే షేర్లలో మరింత కదలిక కనిపించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Follow Us
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బొనాంజా.. ఎంత బోనస్ అంటే..
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బొనాంజా.. ఎంత బోనస్ అంటే..
కంట్రోల్ తప్పిన కోపం.. చైనా ఓపెన్ నుంచి మెద్వెదేవ్ అవుట్
కంట్రోల్ తప్పిన కోపం.. చైనా ఓపెన్ నుంచి మెద్వెదేవ్ అవుట్
నగరంలో 6 కిమీ డబుల్‌ డెక్కర్ కారిడార్‌పై బిగ్‌ అప్‌డేట్
నగరంలో 6 కిమీ డబుల్‌ డెక్కర్ కారిడార్‌పై బిగ్‌ అప్‌డేట్
షుగర్‎ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెడిసిన్.. ఒక్క స్పూన్ తీసుకుంటే
షుగర్‎ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెడిసిన్.. ఒక్క స్పూన్ తీసుకుంటే
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..
వేలం కంటే ముందే హార్దిక్‌కు గుడ్ బై చెప్పనున్న ముంబై.. ఎందుకంటే?
వేలం కంటే ముందే హార్దిక్‌కు గుడ్ బై చెప్పనున్న ముంబై.. ఎందుకంటే?
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..