ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలోని కాంకేర్ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రకటన తర్వాత ప్రధాని మోదీ నిర్వహిస్తున్న తొలి ఎన్నికల ర్యాలీ ఇది. ఆ రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశ కోసం ఏర్పాటు చేయబడిన నక్సలైట్ ప్రభావిత కంకేర్ జిల్లాలో ఈ ర్యాలీ జరిగింది.
కాంకేర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఓ చిన్నారి ప్రధాని మోదీని ఆకర్షించారు. తన పట్ల ప్రేమను కురిపించిన చిన్నారి మనస్ఫూర్తిగా అశీర్వదిస్తున్నట్లు తెలిపారు. ఆకాంక్ష ఠాకూర్ అనే చిన్నారి ప్రధాని మోదీ చిత్రాన్ని పేపర్‌పై స్కెచ్ వేశారు. ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నంత సేపు ఫ్లకార్డు రూపంలో పట్టుకుని నిలబడి ఉంది. నిండు సభలో ఆ చిన్నారి వేసిన బొమ్మను చూసి ప్రధాని మోదీ సైతం మురిసిపోయారు. చిన్నారి చాటిన అభిమానాన్ని అభినందించారు.
#WATCH | Prime Minister Narendra Modi appreciated & thanked a girl who had brought a painting during his rally in Kanker, Chhattisgarh. pic.twitter.com/jnY7J6P01P
— ANI (@ANI) November 2, 2023
పీఎం మోదీ ఆమెను వేదికపై కూర్చోబెట్టి ఆశీర్వదించారు. అంతేకాదు చిన్నారి వేసిన పెయింటింగ్‌ను తన వద్దకు తీసుకురావాలని పోలీసులను ఆదేశించారు. అంతేకాదు లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపేందుకు ఆ అమ్మాయిని పెయింటింగ్ వెనుకవైపున ఆమె చిరునామాను కూడా అందించాలని కోరారు. ఆమెకు లేఖ రాస్తానని హామీ ఇచ్చారు.
“ప్రధాని మోడీ ఇక్కడికి వస్తారని అందరూ మాట్లాడుకుంటున్నారని ప్రధాని మోడీ స్కెచ్ వేసిన ఆకాంక్ష ఠాకూర్ అన్నారు. అటువంటి పరిస్థితిలో, అతనిని కలుస్తానని అనుకున్నానని, తాను వేసిన ప్రధాని మోదీ పెయింటింగ్ ఇవ్వాలనుకున్నాని ఆకాంక్ష చెప్పారు. ఐదో తరగతి చదువుతున్న ఆకాంక్ష ఠాకూర్ ప్రధాని మోదీ కోసం రాత్రంతా కష్టపడి స్కెచ్ వేసినట్లు తెలిపింది.
#WATCH | Kanker, Chhattisgarh: "Everyone was saying that PM Modi will be coming here. I made a sketch for him and he said that he would write a letter to me…," says Akansha Thakur who gifted PM Modi a sketch of him, during an election rally, earlier today. pic.twitter.com/csAjCeH3Ch
— ANI (@ANI) November 2, 2023
ఇదిలావుంటే ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్ నాయకత్వంలో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాష్ట్రంలో మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 7 , 17 తేదీల్లో రెండు దశల్లో జరుగుతాయి. మొదటి దశలో మావోయిస్టు ప్రభావిత బస్తర్ డివిజన్‌లోని రాజ్‌నంద్‌గావ్, మోహ్లా మాన్‌పూర్ అంబగఢ్ చౌకీ, కబీర్‌ధామ్ మరియు ఖైరాఘర్ తో పాటు ఏడు జిల్లాల్లో ఇరవై స్థానాలు ఉంటాయి. చుయిఖండన్ గండాయ్ జిల్లాలు, మిగిలిన 70 స్థానాలకు రెండో దశలో పోటీ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…