Chandrayaan 3 Landed on Moon Highlights: చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ గ్రాండ్ సక్సెస్.. జయహో భారత్‌.. సాహో ఇస్రో..దేశవ్యాప్తంగా సంబరాలు..

|

Aug 27, 2023 | 3:14 PM

Chandrayaan 3 Landed on Moon Highlights: భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 'చంద్రయాన్-3' చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా 'సాఫ్ట్ ల్యాండ్' అయింది. ఈ అపూర్వమైన..  సాటిలేని విజయంతో, భారతదేశం చరిత్ర సృష్టించింది. దాదాపు 3 లక్షల 84 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసింది 41రోజుల ప్రయాణం తర్వాత చంద్రయాన్‌-3 విక్రమ్ ల్యాండర్‌ జాబిల్లిపై అడుగిడింది.

Chandrayaan 3 Landed on Moon Highlights: చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ గ్రాండ్ సక్సెస్.. జయహో భారత్‌.. సాహో ఇస్రో..దేశవ్యాప్తంగా సంబరాలు..
Chandrayaan 3 Landed On Moon

Chandrayaan-3 Landing Live News Updates: ఒకే ఒక్క అడుగు!. భారత్‌ చరిత్ర సృష్టించడానికి ఇంకా మిగిలింది ఒకే ఒక్క అడుగు!. చారిత్రక క్షణాలకు ఇంకా కొన్ని గంటలే మిగిలాయ్‌!. చంద్రయాన్‌-3లో అత్యంత కీలక ఘట్టానికి దగ్గరైంది భారత్‌. 41రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లికి చేరువైంది చంద్రయాన్‌-3. సుమారు 4లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుని ఉపరితలంపై దిగేందుకు రెడీ అవుతోంది ల్యాండర్‌ విక్రమ్‌. బుధవారం సాయంత్రం 5:45కి ల్యాండింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది. ల్యాండింగ్‌ ప్రొసెస్‌ స్టార్ట్‌ అయ్యాక 17 నిమిషాలే అత్యంత కీలకం. టోటల్‌ చంద్రయాన్‌-3 జర్నీలో ఆ 17 నిమిషాలే టెర్రర్‌!. అంతా అనుకున్నట్టు జరిగి ఆ 17 మినిట్స్‌ జర్నీ సక్సెస్‌ అయితే.. భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. జాబిల్లి దక్షిణ ధృవంపై దిగనుంది చంద్రయాన్‌-3 ల్యాండర్‌. అత్యంత భారీ మంచు నిల్వలు ఉన్నట్టు భావిస్తోన్న దక్షిణ ధృవంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కి ప్రయత్నిస్తోంది ఇస్రో. చంద్రుని ఉపరితలంపై దిగే టైమ్‌లో రెండు ఇంజిన్లను ఆన్‌ చేయబోతున్నారు సైంటిస్ట్‌లు.

చరిత్ర సృష్టించడమే లక్ష్యంగా జులై 14న నింగిలోకి దూసుకెళ్లింది చంద్రయాన్‌-3. శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన చంద్రయాన్‌-3… వివిధ దశలను దాటుకొని చంద్రునికి దగ్గరైంది. అంతా అనుకున్నట్టు జరిగితే, చంద్రయాన్‌-3 ల్యాండర్‌ చంద్రునిపై అడుగుపెట్టనుంది. ఆ వెంటనే.. ల్యాండర్‌ కాళ్లకు అమర్చిన సెన్సార్లు.. జాబిల్లి ఉపరితలాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఇంజిన్లు ఆఫ్ అవుతాయ్‌!. సాఫ్ట్‌ ల్యాండింగ్‌ జరిగి.. ల్యాండర్‌ నుంచి రోవల్‌ బయటికి వచ్చిందంటే ప్రయోగం విజయవంతమైనట్టే! దీంతో ఇప్పుడు అందరి దృష్టి చంద్రయాన్-3 మీదే!. ప్రపంచ దేశాల చూపులన్నీ చంద్రయాన్-3పైనే!. జాబిల్లిపై చంద్రయాన్‌-3ని భారత్‌ సాఫ్ట్‌ ల్యాండ్‌ చేయగలుతుందా లేదా అని వెయ్యి కళ్లతో చూస్తున్నాయ్‌!

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Aug 2023 09:35 PM (IST)

    భారత్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు..

    చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ విజయం సాధించిన భారత్‌కు అభినందనలు తెలిపారు.

  • 23 Aug 2023 09:22 PM (IST)

    తొలి చిత్రం ఇదే..

    చంద్రునిపై ల్యాండ్ అవుతున్నప్పుడు చంద్రయాన్-3 యొక్క ల్యాండర్ హారిజాంటల్ వెలాసిటీ కెమెరా ద్వారా బంధించబడిన చంద్రుని చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. Ch-3 ల్యాండర్, MOX-ISTRAC, బెంగళూరు మధ్య కమ్యూనికేషన్ లింక్ ఏర్పడిందని ఇస్రో తెలిపింది.

  • 23 Aug 2023 08:20 PM (IST)

    ప్రజ్ఞాన్ రోవర్ త్వరలో ల్యాండర్ లోపల నుండి బయటకు..

    చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగింది. ఇప్పుడు మరికొద్ది సేపట్లో ప్రజ్ఞాన్ రోవర్ విక్రమ్ ల్యాండర్ లోపల నుండి బయటకు వచ్చి చంద్రునిపై పరిశోధన చేస్తుంది.

  • 23 Aug 2023 08:15 PM (IST)

    నా జీవితంలో ఇంతకంటే సంతోషకరమైన క్షణం లేదు – అనుపమ్ ఖేర్

    నా జీవితంలో ఇంతకంటే సంతోషకరమైన క్షణం లేదు. చిన్నతనంలో చంద మామ దూర్ కే అని పాడేవాళ్ళం.. కానీ ఇప్పుడు అది ఎంతో దూరంలో లేదు. నటుడు అనుపమ్ ఖేర్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “ఈ రోజు నేను దేశానికి, ముఖ్యంగా ఇస్రో శాస్త్రవేత్తలకు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వారు విజయం సాధించారు.”

  • 23 Aug 2023 08:09 PM (IST)

    ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రశంసలు..

    ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇస్రో, మిషన్‌లో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపారు. ఇది మరపురాని క్షణమని, శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించడం ద్వారా భారతదేశం గర్వించేలా చేశారని అన్నారు. జీవితంలో ఒక్కసారైనా జరిగే సంఘటన ఇది. నేను ఇస్రోను, చంద్రయాన్-3 మిషన్‌లో పాల్గొన్న వారందరినీ అభినందిస్తున్నాను. మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

  • 23 Aug 2023 07:22 PM (IST)

    చంద్రయాన్-3 విజయవంతంపై ప్రధాని మోదీ ఫోన్..

    చంద్రయాన్-3 విజయవంతం అయిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా నుంచి ఇస్రో చీఫ్ ఎస్.సోమ్‌నాథ్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

  • 23 Aug 2023 06:50 PM (IST)

    చంద్రయాన్-3 విజయవంతంగా దిగిన తర్వాత..

    చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా దిగిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశ ప్రజలకు అభినందలు తెలిపారు.

  • 23 Aug 2023 06:42 PM (IST)

    ఇది భారతీయుల విజయం.. ల్యాండింగ్ పై సీఎం యోగి

    ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలో చంద్రునిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమాన్ని చూశారు. ఇస్రో మూడవ చంద్ర మిషన్ చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతమైంది.

  • 23 Aug 2023 06:36 PM (IST)

    చంద్రయాన్-3 అభినందిస్తూ ప్రశంసలు..

    భారత్ చంద్రయాన్-3 అన్ని సంక్లిష్టతలను అధిగమించి విజయవంతంగా చంద్రుని ఉపరితలం చేరుకుంది. చంద్రయాన్-3 తన 40 రోజుల ప్రయాణాన్ని ముగించుకుని చంద్రునిపైకి చేరుకోగానే, దేశం మొత్తం గర్వించదగిన ఈ క్షణానికి సంతోషించింది. ఇస్రోను అభినందిస్తూ, ఈ చారిత్రాత్మక క్షణానికి ప్రధాని నరేంద్ర మోదీ యావత్ దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్-3 ‘ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్’ ప్రారంభమైన వెంటనే, ప్రపంచం మొత్తం కళ్ళు ఈ చారిత్రక క్షణంపై పడ్డాయి.

  • 23 Aug 2023 06:11 PM (IST)

    చారిత్రాత్మక క్షణం – విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్‌పై ప్రధాని మోదీ

    చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం చారిత్రాత్మకమని ప్రధాని మోదీ అన్నారు. ఈ క్షణం భారతదేశానికి చెందినది, ఇది దాని ప్రజలకు చెందినది.

  • 23 Aug 2023 06:08 PM (IST)

    చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్

    చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన సందర్భంగా ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ భారతదేశం ఇప్పుడు చంద్రుని దక్షిణ ధృవం మీద ఉందని అన్నారు.

  • 23 Aug 2023 06:02 PM (IST)

    కాసేపట్లో చంద్రయాన్-3 కాసేపట్లో చంద్రుడిపై ల్యాండ్

    చంద్రయాన్-3 కాసేపట్లో చంద్రుడిపై ల్యాండ్ కానుంది. చంద్రయాన్-3 శక్తి దిగడం ప్రారంభమైంది. మొదటి దశ ప్రక్రియ 11 నిమిషాలు ఉంటుంది. చంద్రయాన్-3 సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై అడుగు పెట్టనుంది.

  • 23 Aug 2023 06:00 PM (IST)

    లైవ్ చూస్తున్న ప్రధాని మోాదీ..

    ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా నుంచి ఇస్రో కేంద్రంలో చేరారు. చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రక్రియను ప్రధాని మోదీ వీక్షిస్తున్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ జోహన్నెస్‌బర్గ్‌కు చేరుకున్నారు. ఇప్పటి వరకు అంతా ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని ఇస్రో తెలిపింది. వీసీ ద్వారా ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాకు కనెక్ట్ అయ్యారు.

     

  • 23 Aug 2023 05:58 PM (IST)

    లాల్ చౌక్‌లో జెయింట్‌లో చంద్రయాన్-3 ల్యాండింగ్ ఈవెంట్‌ను లైవ్ టెలికాస్టు..

    దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. జమ్ముకశ్మీర్‌లో చాలా చోట్ల లైవ్ టెలికాస్టు కోసం టీవీలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా చంద్రయాన్-3 ల్యాండింగ్ ఈవెంట్‌ను శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో జెయింట్ స్క్రీన్ ఏర్పాటు చేయబడింది.

     

  • 23 Aug 2023 05:54 PM (IST)

    గ్రౌండ్ నుండి కమాండింగ్ చేయడం లేదు..

    ల్యాండర్ ఊహించదగిన రీతిలో వేగాన్ని తగ్గిస్తోందని.. చాలా సాఫీగా కిందకు దిగుతోందని ఇస్రో తెలిపింది. ఇప్పుడు గ్రౌండ్ నుండి కమాండింగ్ చేయడం లేదు. ప్రస్తుతం కఠినమైన బ్రేకింగ్ దశలో ఉంది.

  • 23 Aug 2023 05:48 PM (IST)

    దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయ్యేందుకు..

    ల్యాండర్ మాడ్యూల్ (LM) ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది సాంత్రం 6:40 గంటలకు పూర్తిస్థాయిలో చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవుతుంది.

     

  • 23 Aug 2023 05:47 PM (IST)

    సరిగ్గా సాయంత్రం 6.04 గంటలకు చంద్రునిపై..

    భారత్‌కు చెందిన చంద్రయాన్-3 మరికొద్దిసేపట్లో చంద్రుడిపై అడుగు పెట్టనుంది. చంద్రయాన్-3 ల్యాండింగ్‌ను కూడా ఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ల్యాండింగ్ ప్రక్రియ సాయంత్రం 5.44 గంటలకు ప్రారంభమవుతుందని..విక్రమ్ ల్యాండర్ సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని ఉపరితలంపై అడుగుపెడుతుంది.

  • 23 Aug 2023 05:42 PM (IST)

    CSIR ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు..

    చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్‌ను చూసేందుకు ఢిల్లీలోని CSIR ప్రధాన కార్యాలయంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ హాజరయ్యారు.

  • 23 Aug 2023 05:40 PM (IST)

    సైన్స్ అండ్ టెక్నాలజీని వ్యతిరేకించే ఎవరైనా మూర్ఖుడే: ఫవాద్ చౌదరి

    టీవీ9 భారతవర్ష్‌తో  పాక్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి మాట్లాడుతూ.. చంద్రయాన్ 3 కోసం భారతదేశానికి, ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఈ మిషన్ మానవాళికి ముఖ్యమైనది. ఇది ప్రతి ఒక్కరికీ ముఖ్యమైనది. సైన్స్ అండ్ టెక్నాలజీని వ్యతిరేకించేవాడు మూర్ఖుడే. చంద్రయాన్ 3 విజయవంతమైన ల్యాండింగ్ ప్రపంచానికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది. ఈరోజు ల్యాండింగ్ ఎప్పుడు జరుగుతుందో.. పాకిస్థాన్ కూడా లైవ్ టెలికాస్ట్ చేయాలని చెప్పాను. గతంలో తాను చేసిన ప్రకటనను కొందరు వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి చంద్రునిపై ఉంటే, ఈద్ ఎలా జరుపుకుంటారు. ఈద్ వివాదంపై ఆ ప్రకటన చేశారు ఆయన.

     

  • 23 Aug 2023 05:37 PM (IST)

    అతి తక్కువ సమయంలో భారత్ రికార్డులు సృష్టిస్తుంది – కైలాష్ ఖేర్

    చంద్రయాన్‌-3 చంద్రుడిపై దిగడానికి ముందు గాయకుడు కైలాష్ ఖేర్ మాట్లాడుతూ.. భారతదేశాన్ని ప్రేమించే వారికి ఇది గర్వకారణం. సైన్స్ అండ్ స్పెస్ సంక్లిష్టమైన సబ్జెక్టులు కానీ నా తోటి భారతీయులు దీని కోసం తీవ్రంగా కృషి చేస్తున్నందున నేను వారికి నమస్కరిస్తున్నాను. మన భారతీయ విలువలకు, మన సనాతన సంప్రదాయాలకు వందనం చేస్తూ, భారతీయులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్ క్షణికావేశంలో రికార్డు సృష్టించబోతోంది అన్నారు..

  • 23 Aug 2023 05:34 PM (IST)

    భారతీయుల ఆశాకిరణం.. చంద్రయాన్‌ -3

    చందమామను ఎయిమ్‌ చేయాలన్న ఇస్రో టార్గెట్ ఇప్పటిది కాదు. దాదాపు రెండు దశాబ్దాల కిందటిది. గతంలో రెండు దశలుగా జరిగిన ప్రయత్నం సంపూర్ణంగా సఫలం కాకపోవడంతో.. ఇప్పుడు చేసిన థర్డ్‌ ఎటెంప్టే చంద్రయాన్‌3. ఇది వందకోట్లకు పైగా భారతీయుల ఆశాకిరణం మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలన్నిటినీ మన వైపు తిప్పుకుంటున్న కీలక ఘట్టం. లాంచింగ్ నుంచి సాఫ్ట్‌ ల్యాండింగ్ దాకా…

  • 23 Aug 2023 05:33 PM (IST)

    ల్యాండింగ్ పాయింట్‌కి చేరువలో..

    ఆటోమేటిక్‌ ల్యాండింగ్‌ సీక్వెన్స్‌ (ఏఎల్‌ఎస్‌)ను ప్రారంభించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు ఇస్రో తెలిపింది. ల్యాండర్ మాడ్యూల్ (LM)  సాయంత్రం 5.44 గంటలకు నిర్ణీత ల్యాండింగ్ పాయింట్‌కి చేరుకుంటుంది.

  • 23 Aug 2023 05:31 PM (IST)

    ల్యాండింగ్‌కు చేరువలో చంద్రయాన్-3

    చంద్రునిపై చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ ల్యాండింగ్ చేయడానికి కొన్ని నిమిషాలు మాత్రమే సమంయ ఉంది. 150 నుండి 100 మీటర్ల ఎత్తుకు చేరుకున్నప్పుడు, ల్యాండర్ దాని సెన్సార్లు, కెమెరాలను ఉపయోగించి ఉపరితలంపై ఏదైనా అడ్డంకి ఉందా అని చెక్ చేస్తుందని ఇస్రో తెలిపింది. అప్పుడు అది సాఫ్ట్-ల్యాండింగ్ చేయడానికి అవరోహణ ప్రారంభమవుతుంది.

  • 23 Aug 2023 05:30 PM (IST)

    టీవీ9లో చంద్రయాన్-3  ల్యాండర్ మాడ్యూల్ ల్యాండింగ్ ప్రక్రియ..

    చంద్రునిపై చంద్రయాన్-3  ల్యాండర్ మాడ్యూల్ ల్యాండింగ్ ప్రక్రియ TV9లో ప్రత్యక్ష ప్రసారం ఇస్రో వెబ్‌సైట్, దాని యూట్యూబ్ ఛానెల్, ఫేస్‌బుక్‌లో ప్రారంభమైంది.

    లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • 23 Aug 2023 05:23 PM (IST)

    ఇస్రో సైంటిస్టుల కుటుంబాల్లో సంబరాలు..

    జాబిల్లి మీద చంద్రయాన్‌ అడుగుపెడుతున్న వేళ ఈ మిషన్‌లో భాగస్వాములైన సైంటిస్టుల కుటుంబాలు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. లక్నోలో సైంటిస్ట్‌ కమలేశ్‌ శర్మ నివాసంలో కూడా సంబరాలు మిన్నంటాయి. ఆయన కూతురు ఇస్రో సైంటిస్టులకు కంగ్రాట్స్‌ తెలిపారు.

  • 23 Aug 2023 05:22 PM (IST)

    చంద్రయాన్-3 ల్యాండింగ్ లైవ్ ఇక్కడ చూడండి..

    చంద్రుడు 444 కోట్ల సంవత్సరాల క్రితం ఉనికిలోకి వచ్చాడు. 444 మిలియన్ సంవత్సరాల క్రితం, మార్స్ పరిమాణంలో ఉన్న ఒక ప్రోటోప్లానెట్ భూమిని ఢీకొట్టింది. శాస్త్రవేత్తలు ఈ సంఘటనను జెయింట్ ఇంపాక్ట్ అని పిలుస్తారు. ఈ ఢీకొనడంతో భూమిలో ఎక్కువ భాగం విరిగిపోయింది. భయంకరమైన తాకిడి కారణంగా, చాలా వేడి ఏర్పడింది, దీని కారణంగా రాళ్ళు కరిగిపోయాయి. చంద్రయాన్-3 ల్యాండింగ్ లైవ్ కోసం ఇక్కడ చూడండి..

    చంద్రయాన్ లైవ్ ఇక్కడ చూడండి..

    పూర్తి వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

  • 23 Aug 2023 04:41 PM (IST)

    గతం నుంచి చాలా నేర్చుకున్నాం.. – సీఎస్‌ఐఆర్‌ సీనియర్‌ శాస్త్రవేత్త

    మరికొద్ది సేపట్లో చంద్రయాన్‌-3 చంద్రుడిపై అడుగు పెట్టనుందని సీఎస్‌ఐఆర్‌ సీనియర్‌ శాస్త్రవేత్త సత్యనారాయణ తెలిపారు. ఈ చారిత్రాత్మక క్షణంతో.. మేము చంద్రుని ఉపరితలాన్ని తాకడానికి టాప్ 4లోకి మన దేశం కూడా చేరనుంది. వైఫల్యాలు ఎల్లప్పుడూ పాఠాలను అందిస్తాయి. దాని నుంచి మనం చాలా నేర్చుకున్నాము. గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని, చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3ని సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు ఇస్రో తగిన జాగ్రత్తలు తీసుకుంది.

  • 23 Aug 2023 03:15 PM (IST)

    చంద్రయాన్‌-3 ప్రయోగం సక్సెస్‌ కావాలంటూ విశాఖ శ్రీ శారదాపీఠం ప్రత్యేక పూజలు..

    చంద్రయాన్ అంతరిక్ష నౌక విజయవంతంగా చంద్రుడిపైకి అడుగు మోపాలని ఆకాంక్షిస్తూ విశాఖ శ్రీ శారదాపీఠం ప్రత్యేక పూజలు నిర్వహించింది. చాతుర్మాస్య దీక్షలో ఉన్న పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల పర్యవేక్షణలో బుధవారం వనదుర్గా హోమం నిర్వహించారు. రిషికేష్ లోని విశాఖ శ్రీ శారదాపీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఈ హోమం చేపట్టారు. వనదుర్గా హోమం పూర్ణాహుతిలో పీఠాధిపతులుఫాల్గొన్నారు. భారతావని ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు చంద్రయాన్ ప్రయోగం దోహదపడుతుందని స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్నారు. ప్రపంచంలో బలీయమైన శక్తిగా భారత్ ఎదగాలనే ఆకాంక్షతోనే వనదుర్గా హోమం చేపట్టినట్లు తెలిపారు.

     

  • 23 Aug 2023 02:44 PM (IST)

    అంతా బాగానే ఉంది.. మేము ల్యాండర్ ప్రతి కదలికను చూస్తున్నాం: ఇస్రో

    చంద్రయాన్ 3 ల్యాండింగ్‌కు సంబంధించి ఓ కీలక ట్వీట్ చేసింది ఇస్రో. అంతా అనుకూలంగా ఉందని.. ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని, ల్యాండర్ ప్రతి కార్యాచరణను తాము గమనిస్తున్నామని తెలిపింది.

  • 23 Aug 2023 02:42 PM (IST)

    చంద్రయాన్ ల్యాండింగ్ అల్గోరిథం మారింది

    చంద్రుని దగ్గర 10 మీటర్లకు చేరుకున్న వెంటనే చంద్రయాన్ వేగం సెకనుకు 1.68 మీటర్లుగా ఉంటుంది. ల్యాండింగ్ సమయంలో వేగాన్ని కొలవడానికి వాహనంలో లేజర్ డాప్లర్ వెలోసిమీటర్‌ను అమర్చారు. సాఫ్ట్ ల్యాండింగ్‌ను విజయవంతం చేసేందుకు.. ఇస్రో చంద్రయాన్ ల్యాండింగ్ అల్గారిథమ్‌ను మార్చింది. కొన్ని కారణాల వల్ల నిర్ణీత ప్రదేశంలో ల్యాండింగ్ చేయలేకపోతే.. చంద్రయాన్-3ని వేరే ప్రదేశంలో ల్యాండ్ చేయవచ్చు.

  • 23 Aug 2023 02:12 PM (IST)

    Chandrayaan-3 Moon Landing: చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌కు సర్వం సిద్ధం

    చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌కు సర్వంసిద్ధమైంది. ఈ క్రమంలో ల్యాండింగ్‌ ప్రక్రియపై ఇస్రో అధికారిక ప్రకటన చేసింది. నిర్దేశిత దక్షిణ ధృవం సమీపానికి విక్రమ్‌ ల్యాండర్‌ చేరింది. సాయంత్రం 5:44కి ప్రక్రియ మొదలవుతుందని.. 5:44 తర్వాత ఆటోమేటిక్‌ ల్యాండింగ్‌ ప్రొసెస్‌ ప్రారంభమవుతుందని తెలిపింది. సా.5:20నుంచి ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని ఇస్రో పేర్కొంది.

  • 23 Aug 2023 01:56 PM (IST)

    Chandrayaan-3: సాయంత్రం 5.20 నుంచి ప్రత్యక్ష ప్రసారం.. ఇస్రో కీలక ట్వీట్..

    ప్రపంచం మొత్తం చంద్రయాన్‌-3 ప్రయోగంపై ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. మరికొన్ని గంటల్లో చంద్రుడి దక్షిణ ధృవం మీద విక్రమ్‌ ల్యాండర్‌ దిగనుంది. ఈ క్రమంలో ఇస్రో కీలక ట్విట్ చేసింది.. సాయంత్రం 5:44 నిమిషాలకు విక్రమ్ ల్యాండింగ్ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొంది. MOXలో కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం సాయంత్రం 5:20 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

  • 23 Aug 2023 01:43 PM (IST)

    Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ ఏమన్నారంటే..

    మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు కంగ్రాట్స్‌ తెలిపారు. ప్రధాని మోదీ కృషి వల్లే చంద్రయాన్‌-3 గమ్యాన్ని చేరుతోందని అన్నారు. చంద్రయాన్ సక్సెస్ అవుతుందంటూ పేర్కొన్నారు.

  • 23 Aug 2023 01:34 PM (IST)

    Anurag Thakur: రోదసీరంగంలో భారత్‌ అగ్రస్థాయికి చేరుకుంటుంది..

    చంద్రయాన్‌-3 తప్పకుండా సక్సెస్‌ అవుతుందని దేశంలోని ప్రముఖులంతా గట్టి నమ్మకంతో ఉన్నారు. 140 కోట్ల భారతీయుల లాగే చంద్రయాన్‌-3 సక్సెస్‌ కావాలని కోరుకుంటునట్టు తెలిపారు కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌. రోదసీరంగంలో భారత్‌ అగ్రస్థాయికి చేరుకుంటుందన్నారు.

  • 23 Aug 2023 01:08 PM (IST)

    ISRO: 54ఏళ్ల ప్రస్థానంలో అనేక సంచలన విజయాలు..

    54ఏళ్ల ప్రస్థానంలో అనేక సంచలన విజయాలను తన ఖాతాలో వేసుకుంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఏర్పాటైతే, కేవలం ఆరేళ్లలోనే తొలి ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి పంపి సంచలనం సృష్టించింది. 1975లో ఆర్యభట్టను నింగిలోకి పంపి విజయం సాధించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి సక్సెస్‌ కొట్టింది ఇస్రో.

  • 23 Aug 2023 12:48 PM (IST)

    Chandrayaan: మూడు దేశాలే సాఫ్ట్‌ ల్యాండింగ్‌.. అవేంటంటే..

    చంద్రునిపై ఇంతవరకూ మూడు దేశాలే సాఫ్ట్‌ల్యాండింగ్‌ చేశాయి. అమెరికా, రష్యా, చైనా మాత్రమే మూన్‌ మిషన్‌లో సఫలం అయ్యాయి. ఇప్పుడు విక్రమ్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేస్తే.. నాలుగో దేశంగా భారత్‌ చరిత్ర సృష్టిస్తుంది.

  • 23 Aug 2023 12:20 PM (IST)

    Chandrayaan 3 journey: చంద్రయాన్-3 జర్నీ ఎలా సాగిందంటే..

    చరిత్ర సృష్టించడమే లక్ష్యంగా జులై 14న నింగిలోకి దూసుకెళ్లింది చంద్రయాన్‌-3. శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన చంద్రయాన్‌-3… వివిధ దశలను దాటుకొని చంద్రునికి దగ్గరైంది. అసలు, చంద్రయాన్‌-3 జర్నీ ఎప్పుడు మొదలైందో!. ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం!

    చంద్రయాన్-3 జర్నీ ఇలా..

    • జులై 14 – ప్రయోగం
    • జులై 15 – మొదటి భూకక్ష్య
    • జులై 17 – రెండో భూకక్ష్య
    • జులై 18 – మూడో భూకక్ష్య
    • జులై 22 – నాలుగో భూకక్ష్య
    • జులై 25 – ఐదో భూకక్ష్య
    • ఆగస్ట్ 1 – ట్రాన్స్‌లూనార్ ఆర్బిట్‌
    • ఆగస్ట్ 5 – చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశం
    • ఆగస్ట్ 6 – చంద్రుడి మొదటి కక్ష్య
    • ఆగస్ట్ 9 – చంద్రుడి రెండో కక్ష్య
    • ఆగస్ట్ 14 – చంద్రుడి మూడో కక్ష్య
    • ఆగస్ట్ 16 – చంద్రుడి నాలుగో కక్ష్య
    • ఆగస్ట్ 17 – ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యుల్ సెపరేషన్
    • ఆగస్ట్ 18 – ఫస్ట్ డీ-బూస్టింగ్
    • ఆగస్ట్ 20 – సెకండ్ డీ-బూస్టింగ్
    • ఆగస్ట్ 23 – ల్యాండింగ్‌కి రెడీ
  • 23 Aug 2023 11:54 AM (IST)

    Chandrayaan-3: చంద్రయాన్‌-3 ప్రయోగం సక్సెస్‌ కావాలని ఏపీలో పూజలు..

    తిరుపతిలో చంద్రయాన్‌ 3 విజయవంతం కావాలని పూజలు చేస్తున్నారు.. మంగళంలోని తిరుమల నగర్‌లో శ్రీ ఈశానేశ్వర నవలింగ క్షేత్రంలో శివలింగం ముందు చంద్రయాన్ నమూనా ను పెట్టి రుద్రాభిషేకం నిర్వహించారు అర్చకులు. అటు స్థానికులు కూడా తిరుమల శ్రీవారి ఆశీస్సులతో చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ కావాలని పూజలు చేశారు. దీంతోపాటు తెలంగాణలోని భైంసాలోనూ చంద్రయాన్‌ 3 సక్సెస్‌ కావాలని పిల్లలు విష్‌ చేశారు.. చంద్రయాన్‌ 3 అనే పదాల ఆకారంలో కూర్చి విషెస్‌ చెప్పారు స్కూల్‌ పిల్లలు..

  • 23 Aug 2023 11:26 AM (IST)

    PM Modi: మధుర క్షణాలను తిలకించనున్న ప్రధాని మోడీ..

    ప్రధాని మోడీ సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.. మోడీ బిజీగా ఉన్నప్పటికీ చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రక్రియను వీక్షించనున్నారు. ప్రధాని మోడీ ఇస్రో శాస్త్రవేత్తలతో వర్చువల్‌గా ఈ మధుర క్షణాలను తిలకించనున్నారు.

  • 23 Aug 2023 11:15 AM (IST)

    Chandrayaan 3 Moon Mission: చంద్రయాన్‌-3 ప్రయోగం సక్సెస్‌ కావాలని సర్వమత ప్రార్ధనలు..

    జాబిల్లిపై ల్యాండర్‌ అడుగుపెట్టే చారిత్రక క్షణాల కోసం యావత్‌ ప్రపంచం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. చంద్రయాన్‌-3 ప్రయోగం సక్సెస్‌ కావాలని దేశమంతా సర్వమత ప్రార్ధనలు కొనసాగుతున్నాయి. మరికొద్ది గంటల్లో ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నింగిలోకి పంపిన చంద్రయాన్-3 వ్యోమనౌక జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో చంద్రయాన్-3 విజయవంతమవ్వాలని దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కులమతాలకు అతీతంగా భగవంతుడికి ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నారు.అటు.. వారణాసిలోనూ చంద్రయాన్‌-3 సక్సెస్‌ కావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ యాగంలో సాధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విక్రం ల్యాండర్‌ చంద్రుడిపై సేఫ్‌గా ల్యాండ్‌ కావాలని లక్నోలోని మసీదులో ముస్లింలు కూడా నమాజ్‌ చేశారు.

  • 23 Aug 2023 10:53 AM (IST)

    ISRO: భారీ సైకత శిల్పంతో.. ఆల్​ ది బెస్ట్ ఇస్రో

    ఒడిశాలోని పూరిలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్​.. చంద్రయాన్​-3కి తన కళతో ఆల్​ ది బెస్ట్ తెలిపారు. పూరి సముద్ర తీరాన సుదర్శన్​ బృందం.. భారీ సైకత శిల్పాన్ని రూపొందించింది. జయహో ఇస్రో అంటూ ఇసుకతో చెక్కింది. ఈ సైకత శిల్పం.. పర్యాటకలను విశేషంగా ఆకర్షిస్తోంది.

  • 23 Aug 2023 10:51 AM (IST)

    Isro 2023 mission live: 2 ఇంజన్లతో..

    2 ఇంజిన్లతో దిగనున్న ల్యాండర్‌ విక్రమ్‌.. ల్యాండర్‌ కాళ్లకు అమర్చిన సెన్సర్లు.. చందమామ ఉపరితలంపై దిగినట్టు కన్ఫామ్ చేసుకున్నాక.. అన్ని ఇంజిన్లు ఆఫ్ అవుతాయి.. అప్పుడు రోవర్‌ బయటకు వచ్చి తన పని మొదలుపెడుతుంది.

  • 23 Aug 2023 10:38 AM (IST)

    Chandrayaan 3 Moon Landing LIVE: 30 కి.మీ. ఎత్తు నుంచి ల్యాండింగ్‌

    30 కి.మీ. ఎత్తు నుంచి ల్యాండింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది.. 800 మీటర్లకు వచ్చాక వేగం తగ్గుతుంది.. 150 మీటర్లు ఎత్కుకు వచ్చాక.. ఎగుడు, దిగుడు లేని ప్లేస్‌ చూసి దిగుతుంది.

  • 23 Aug 2023 10:32 AM (IST)

    Chandrayaan 3 live updates: దక్షిణ ధృవంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కి ప్రయత్నం..

    దక్షిణ ధృవంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కి ప్రయత్నం చేస్తోంది ఇస్రో. దక్షిణ ధృవం దగ్గర ఉన్న మట్టిలో గడ్డకట్టిన మంచు అణువులను కనిపెట్టాలని ప్రయత్నిస్తోంది. 6:04PMకి జాబిల్లి ఉపరితలంపైకి చేరడంతో ఈ మిషన్‌ సక్సెస్ అవుతుంది. జాబిల్లి ఉపరితలానికి 800 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత 2 ఇంజిన్లు ఆఫ్ అవుతాయి. క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ ల్యాండ్ అవుతుంది.

  • 23 Aug 2023 10:24 AM (IST)

    Live location of chandrayaan 3: చివరి 17 నిమిషాలే అత్యంత కీలకం..

    సెకనుకు 3 కి.మీ. వేగంతో ల్యాండింగ్‌.. ఉపరితలానికి వెళ్లే సమయంలో ల్యాండర్‌ వేగం కూడా చాలా కీలకం.. దీన్ని సొంతంగానే కంట్రోల్‌ చేసుకునే వ్యవస్థ అందులో ఉంటుంది. చివరి 17 నిమిషాలే అత్యంత కీలకం. దీన్నే 17 నిమిషాల టెర్రర్‌గా చెప్తోంది ఇస్రో. చంద్రుడి ఉపరితలానికి 30 కిలోమీటర్ల ఎత్తులోంనుంచి ల్యాండర్ ‘పవర్‌ బ్రేకింగ్’‌ దశలోకి వెళ్తుంది. సేఫ్‌గా దిగే వరకూ ఈ 17 నిమిషాలూ చాలా చాలా కీలకం.

  • 23 Aug 2023 10:22 AM (IST)

    Chandrayaan 3 live updates today: సూర్యకాంతి రాగానే ప్రక్రియ మొదలు..

    5:45PM తర్వాత ల్యాండింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది. లక్ష్యం దిశగా విక్రమ్‌ ల్యాండర్ తన ప్రయాణంలో కీలక ఘట్టాన్ని మొదలుపెడుతుంది. సూర్యకాంతి రాగానే ప్రక్రియ మొదలవుతుంది. నిర్దేశిత ల్యాండింగ్‌ ప్రదేశంలో దిగేందుకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూసుకునేందుకే సూర్యోదయం కోసం వెయిట్‌ చేస్తున్నారు.

Follow us on