రెండు విడతల్లో జీఎస్టీ బకాయిల చెల్లింపు.. తెలంగాణకు కేంద్రం హామీ

జీఎస్టీ, ఐజీఎస్టీకి సంబంధించి తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు రావలసిన బకాయిలను రెండు విడతలుగా విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. సోమవారం లోక్ సభలో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన.. ఈ మేరకు హామీ ఇఛ్చారు.  ఈ రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ బకాయిలను రిలీజ్ చేస్తామన్నారు. ఈ చట్టాల అమలు కారణంగా రెవెన్యూ నష్టాలను ఎదుర్కొంటున్న […]

రెండు విడతల్లో జీఎస్టీ బకాయిల చెల్లింపు.. తెలంగాణకు కేంద్రం హామీ

జీఎస్టీ, ఐజీఎస్టీకి సంబంధించి తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు రావలసిన బకాయిలను రెండు విడతలుగా విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. సోమవారం లోక్ సభలో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన.. ఈ మేరకు హామీ ఇఛ్చారు.  ఈ రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ బకాయిలను రిలీజ్ చేస్తామన్నారు. ఈ చట్టాల అమలు కారణంగా రెవెన్యూ నష్టాలను ఎదుర్కొంటున్న రాష్ట్రాలు చింతించవలసిన అవసరం లేదని చెప్పారు. 2017 జులై నెలనుంచి జీఎస్టీ అమలు కాగా ఇప్పటివరకు ఆయా రాష్ట్రాలకు రూ. 2,10,969 కోట్లు విడుదల చేసినట్టు అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. రెండు నెలలకు కలిపి ఒకసారి జీఎస్టీ చెల్లింపులు జరుపుతున్నామన్నారు.

కాగా-సెంట్రల్ ఎక్సయిజు పన్ను, కస్టమ్స్ పన్ను, ఇన్ కమ్ టాక్స్, ఐజీఎస్టీ తదితర రూపాల్లో తెలంగాణ నుంచి కేంద్ర ఖజానాకు రూ. 50 వేల కోట్లకు పైగా చేరుతున్నప్పటికీ.. కేంద్రం నుంచి రాష్ట్రానికి సుమారు 25 వేల కోట్లయినా రావడంలేదని తెలుస్తోంది. తక్కువ జనాభా, ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాలకు 15 వ ఫైనాన్స్ కమిషన్ ప్రాధాన్యతను తగ్గించడంతో కేంద్రం నుంచి తెలంగాణకు వచ్ఛే పన్నుల వాటా, గ్రాంట్లు తగ్గిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. అలాగే ఇటీవలి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోవడంలేదని ప్రభుత్వ వర్గాలు ఆరోపించాయి.

Published On - 4:30 pm, Mon, 3 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu