Udhav Thackeray: సుప్రీంకోర్టులో ఉద్ధవ్ థాక్రేకు షాక్.. శివ‌సేన ఎవ‌రిదో తేల్చేందుకు ఈసీకి అనుమతి..

|

Sep 28, 2022 | 5:51 AM

అసలైన శివసేన తమదే అంటున్న ఉద్దవ్‌థాక్రేకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ వర్గాన్నే అసలైన శివసేనగా గుర్తించాలని షిండే పెట్టుకున్న అభ్యర్ధనపై ఈసీ పరిశీలించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

Udhav Thackeray: సుప్రీంకోర్టులో ఉద్ధవ్ థాక్రేకు షాక్.. శివ‌సేన ఎవ‌రిదో తేల్చేందుకు ఈసీకి అనుమతి..
Uddhav Thackeray, Eknath Shinde
Follow us on

అసలైన శివసేన తమదే అంటున్న ఉద్దవ్‌థాక్రేకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ వర్గాన్నే అసలైన శివసేనగా గుర్తించాలని షిండే పెట్టుకున్న అభ్యర్ధనపై ఈసీ పరిశీలించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. శివసేనలో షిండే వర్గం తిరుగుబాటు తరువాత ఆ పార్టీపై హక్కుల కోసం పోరాటంలో భాగంగా ఉద్ధవ్‌ ఠాక్రే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. తమ వర్గాన్నే అసలైన శివసేనగా గుర్తించాలని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించేందుకు ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. థాక్రే , షిండే వర్గాల్లో ఎవరిది అసలైన శివసేన అనేది ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

కాగా, శివసేనలో షిండే తిరుగుబాటుతో మహా వికాస్‌ అఘాడి సర్కార్‌ కుప్పకూలింది. పార్టీ నియంత్రణ, ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ తమకే కేటాయించాలని ఈసీని కోరింది షిండే వర్గం. అయితే, దీన్ని థాక్రే వర్గం వ్యతిరేకించింది. ఎమ్మెల్యేల అనర్హత, పార్టీ వ్యవహారాలకు సంబంధించి పలు అంశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున తదుపరి చర్యలేమీ తీసుకోకూడదని థాక్రే వర్గం ఈసీకి విజ్ఞప్తి చేసింది. అయితే థాక్రే అభ్యర్ధనను లైట్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. విల్లంబుల గుర్తు తమదేనని రుజువు చేసే పత్రాలను సమర్పించాలని ఇరువర్గాలను ఆదేశించింది. శివసేన శాసనసభా పక్షంతో పాటు పార్టీ సంస్థాగత విభాగ సభ్యుల మద్దతు లేఖలను కూడా ఇవ్వాలని రెండు వర్గాలను కోరింది.

అనంతరం ఈసీ నిర్ణయంపై థాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం ఇంకా తేలలేదు గనుక.. షిండే వర్గం పెట్టుకున్న అర్జీపై ఈసీ చర్యలు తీసుకోకుండా నివారించాలని పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై గతంలో విచారించిన సుప్రీంకోర్టు.. ఈసీ ప్రక్రియపై స్టే విధించింది. శివసేన వ్యవహారంపై విచారణ చేపట్టిన రాజ్యాంగ ధర్మాసనం.. థాక్రే వర్గం పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ఇవి కూడా చదవండి

అసలైన శివసేనను గుర్తించడం, పార్టీ ఎన్నికల గుర్తును కేటాయించడంలో ఈసీ నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామన్నారు శివసేన నేతలు .అయితే పార్టీ మారిన ఎమ్మెల్యే అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి