కరోనా భయంతో భార్యను తాకని కొత్త పెళ్లికొడుకు, నపుంసకుడన్న అనుమానంతో కోర్టుకెక్కిన అర్ధాంగి

ఈ ఏడాది త్వరగా వెళ్లిపోతే బాగుండని సకల ప్రపంచమూ కోరుకుంటోంది.. అసలు ఇంతటి భయానక సంవత్సరాన్ని పుట్టి బుద్ధెరిగిన తర్వాత చూసి ఉండం.. పాడు కరోనాతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి..

కరోనా భయంతో భార్యను తాకని కొత్త పెళ్లికొడుకు, నపుంసకుడన్న అనుమానంతో కోర్టుకెక్కిన అర్ధాంగి
Follow us

|

Updated on: Dec 07, 2020 | 11:07 AM

ఈ ఏడాది త్వరగా వెళ్లిపోతే బాగుండని సకల ప్రపంచమూ కోరుకుంటోంది.. అసలు ఇంతటి భయానక సంవత్సరాన్ని పుట్టి బుద్ధెరిగిన తర్వాత చూసి ఉండం.. పాడు కరోనాతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి.. అసలు కరోనా మహమ్మారి మనుషులతో ఓ ఆటాడేసుకుంటోంది.. సంబంధాలను దెబ్బ తీస్తోంది.. ఆఖరికి కాపురంలో చిచ్చు కూడా పెడుతోంది.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ఓ సంఘటన చూస్తే మనషులపై కరోనా ప్రభావం ఎంతగా ఉందో అర్థమవుతుంది. జూన్‌ 29న ఓ యువకుడు పెళ్లి చేసుకున్నాడు.. పెళ్లయిన నాటి నుంచి భార్యను కనీసం తాకను కూడా తాకలేదు.. మాట్లాడేటప్పుడు కూడా రెండు భౌతికదూరం పాటిస్తున్నాడు.. తన భర్త ప్రవర్తన చూసి భార్యకు అనుమానం వచ్చింది.. కొంపదీసి సంసారానికి పనికి రాడు కదా అని బాధపడింది.. ఆ ఆవేదనతోనే పుట్టింటికి వెళ్లిపోయింది.. నపుంసకుడైన భర్తతో కలిసి ఉండటం కుదరని పని అనుకుని విడాకుల కోసం కోర్టుకెక్కింది.. పెళ్లియిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా తనను ముట్టుకోలేదని కోర్టుకు విన్నవించుకుంది. పైగా అత్తమామలు కూడా తనను వేధిస్తున్నారని బాధపడింది.. కోర్టు ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చింది.. కౌన్సిలింగ్‌లో ఆ యువకుడు చెప్పింది విని ఆశ్చర్యపోయారు.. అసలు విషయం ఏమిటంటే ఆ యువకుడికి కరోనా అంటే చచ్చేంత భయమట! కరోనా సోకితే చచ్చిపోతానేమోనన్న ఫోబియా అతగాడికి పట్టేసుకుందట! పైగా పెళ్లయిన వెంటనే భార్య కుటుంబంలో కొందరికి కరోనా వైరస్‌ సోకిందని, తన భార్యకు కూడా కరోనా అంటుకునే ఉంటుందని భావించాడట! అందుకే భార్యతో దూరంగా ఉంటానని చావు కబురు చల్లగా చెప్పాడు.. ఎందుకైనా మంచిదని అతగాడికి లైంగిక పరీక్షలు నిర్వహించారు.. అందులో ఫిట్‌గా ఉన్నట్టు తెలడంతో అమ్మాయి తరఫు బంధువులు ఊపిరి పీల్చుకున్నారు..

Latest Articles